Rashmika Mandanna Wheel Chair | నడవలేని స్థితిలో కుంటుతున్న రష్మిక | ABP Desam
పుష్ప తో నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించిన రష్మిక..ఇప్పుడు కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. అయినా తనకున్న డెడికేషన్ ఎలాంటిదంటే కుంటు కుంటూ వెళ్తూ షూటింగ్స్ కి అటెండ్ అవుతున్నారు. ఈరోజు ముంబై ఎయిర్ పోర్ట్ లో ఇలా వీల్ ఛైర్ లో కనిపించారు రష్మిక. కారులోకి ఎక్కటానికి తను కుంటు కుంటూ వెళ్లటం చూసి రష్మిక ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్న రష్మిక..రెండు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా రష్మిక కాలు ఫ్రాక్చర్ అయ్యింది. కొన్ని వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్పగా..తనకున్న కమిట్మెంట్స్ వల్ల కొద్దిరోజులు మాత్రమే రెస్ట్ తీసుకుని మిగిలిన రోజులు కుంటు కుంటూ అయినా షూటింగ్స్ కి వెళ్లిపోతానంటూ పోస్ట్ కూడా రష్మిక. ఇప్పుడు అన్నట్లుగానే హాపింగ్ చేసుకుంటూ గెంతుతూ రష్మిక ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.





















