HariHaraVeeraMallu Trailer Reaction | వీరమల్లుగా Pawan Kalyan విందు భోజనం పెడుతున్నారా.? | ABP Desam
రెండేళ్ల విరామం తర్వాత ఫ్యాన్స్ కి వింధు భోజనం పెట్టడానికి రెడీ అయిపోయారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లుగా ఆయన నటించిన సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజై పోయింది. ముందు క్రిష్ డైరెక్టర్ గా...తర్వాత జ్యోతికృష్ణ దర్శకత్వంలోకి మారిన ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది ఈ రివ్యూలో చూసేద్దాం. కథ సింపుల్. ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధం. హరిహర వీరమల్లు స్వార్డ్ వర్సెస్ స్పిరిట్..బ్యాటిల్ ఆఫ్ ధర్మ అని పార్ట్ 1కి పేరు పెట్టి గ్లింప్స్ వదిలినప్పుడే కథ దేని గురించి అనేది చాలా మందికి ఓ ఐడియా వచ్చేసింది. ఇప్పుడు దానిపై మరింత క్లారిటీ వచ్చేసింది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం..ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం...ఓ వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ హరిహర వీర మల్లు క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ ఏంటో ట్రైలర్ స్టార్టింగ్ లో చెప్పారు. గోల్కొండ నుంచి బయలుదేరిన 8వాడిని ఢిల్లీ రాకుండా ఆపేది ఎవరు..? దేశ ప్రజలను పీడించుకుతిన్న ఔరంగజేబును వీరమల్లు ఎలా ఎదుర్కొన్నాడనేది కథ అనేది అర్థమవుతోంది. పైగా కోహినూర్ కొట్టుకుని తీసుకువచ్చేవాడు ఒక్కడే ఉన్నాడని వీరమల్లు లక్ష్యం ఏంటో కూడా చెప్పారు సినిమాలో. ట్రైలర్ లో ఆంధీ వచ్చేసింది అని ఔరంగజేబు క్యారెక్టర్ తో చెప్పించటం చూస్తుంటే వీరమల్లుకు, ఔరంగజేబు సైన్యానికి జరగబోయే వార్ గురించి హింట్ ఇచ్చారని అర్థమవుతోంది. ఇక శివభక్తుడైన హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్, ఔరంగజేబుగా బాబీ డియోల్ మధ్య ఇంటెన్సిఫైడ్ వార్ చూడనున్నామనేది మాత్రం పక్కా. ట్రైలర్ లో ఎక్కువ డైలాగులు వినిపించాయి. సాయి మాధవ్ బుర్రా అండ్ టీమ్ బాగా వర్కవుట్ చేసినట్లున్నారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కూడా కలిసేలా డైలాగులు రాసుకున్నారు. నేను రావాలని చాలా మంది కోరుకుంటారు. కానీ నన్ను ఆపాలని మీరు ట్రై చేశారని పవన్ కళ్యాణ్ తో చెప్పించటం...కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పార్లమెంటు సెంట్రల్ హాల్ లో పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ ఆంధీ అంటే తుఫాను అని హిందీలో సంబోధించిన మాటను ట్రైలర్ లో వాడటం చూస్తే ఆయన పొలిటికల్ జర్నీని ఎలా సినిమాలో మిళితం చేశారనేది అర్థం అవుతుంది. ఈటె లాంటి ఆయుధాలతో పవన్ చేసిన ఫైట్స్, కీరవాణి తో RR తో గ్రాండియర్ ను తలపిస్తున్నాయి. మరి క్రిష్ ను కాదని జ్యోతి కృష్ణ చేతిలో పడిన ఈ సినిమా ఏ మేరకు ఫ్యాన్స్ ను ఆకట్టుకోనుందో తెలియాలంటే ఈనెల 24వరకూ ఆగాల్సిందే.





















