Jr NTR Speech : స్టేజిపై ఇద్దరు తెలుగోళ్ళు కనిపించారు | Das Ka Dhamki | ABP Desam
ఆస్కార్స్ నుంచి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హాజరైన తొలి వేడుక . ఇందులో ఆస్కార్స్ గురించి ఆయన మాట్లాడారు. విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'దాస్ కా ధమ్కీ' ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు అయ్యారు. ఆస్కార్ విజయం వెనుక చిత్ర బృందం కృషితో పాటు అభిమానుల ప్రేమ కూడా ఉందని ఎన్టీఆర్ చెప్పారు.
'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రపంచ పటంలో నిలబడిందంటే... ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుందంటే... దానికి జక్కన్న (రాజమౌళి) గారు ఎంత కారకులో? కీరవాణి గారు ఎంత కారకులో? చంద్రబోస్ గారు ఎంత కారకులో? పాట పాడినటువంటి కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఎంత కారకులో? ఆ పాటను కొరియోగ్రఫీ చేసినటువంటి ప్రేమ్ రక్షిత్ ఎంత కారకులో? వీళ్లందరితో పాటు యావత్ తెలుగు చిత్రసీమ, అలాగే భారతీయ చిత్రసీమ కూడా అంతే కారణం. ప్రేక్షక దేవుళ్ళు కూడా అంతే కారణం అని చెప్పారు.





















