Revanth Reddy Tribute To Srikanthachari : నివాళి అర్పిస్తూ రేవంత్ రెడ్డి ట్వీట్
తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్ చూస్తుంటే.. స్పష్టమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్ దూసుకుపోతోంది. రౌండ్లు మారుతున్నా సరే, దాదాపుగా ప్రతిసారీ మ్యాజిక్ ఫిగర్ 60 మార్క్ మెయింటైన్ చేస్తూ ముందుకు పరిగెడుతోంది. అప్పుడే గాంధీ భవన్ లో మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నివాసం వద్ద సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అనే నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులంతా వచ్చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలంగాణ సాధన కోసం అమరులైన వందలాది మందిలో ఒకరు శ్రీకాంతాచారి. ఇవాళ అంటే డిసెంబర్ 3వ తేదీ ఆయన వర్ధంతి. ఈరోజు ఆయనకు నివాళి అర్పిస్తున్నానన్న రేవంత్ రెడ్డి.... అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నైమందంటూ ట్వీట్ చేశారు.




















