కృష్ణలంకలో వైసీపీ కార్యకర్తలతో వైఎస్ జగన్
విజయవాడ కృష్ణలంకలో వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటించారు. మధ్యాహ్నం వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్ నగర్ లో పర్యటించనున్న ఆయన ముందుగా కృష్ణలంకకు వెళ్లి అక్కడ స్థానికులను కలిశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో కృష్ణలంకపై వరద ప్రభావం అంతగా పడలేదని అందుకు ప్రజలు వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారని వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోను పోస్ట్ చేసింది. అక్కడి స్థానికులు వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఎగబడ్డారు. వరదల ప్రభావం విజయవాడ నగరంపై భారీగా పడింది. కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. ముఖ్యంగా సింగ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఇళ్లకు ఇళ్లే మునిగిపోవడం చాలా బాధాకరమైన విషయం. సీఎం చంద్రబాబు కూడా ఈ ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు తాము అండగా ఉన్నామని హామీ ఇచ్చారు. కృష్ణా నదిలో బోట్లు కొట్టుకు రావడంతో ప్రకాశం బ్యారేజ్ కూడా కొంత మేర దెబ్బ తింది. దీంతో బ్యారేజీపై రాకపోకలు నిలిపివేశారు.