అన్వేషించండి
Girl Attacks fiancé| Anakapalli Crime: కాబోయే భర్త గొంతు కోసిన యువతి | ABP Desam
అనకాపల్లిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తపై దాడి యువతి దాడిచేసింది. కాబోయే భర్తను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని పిలిచి దాడి చేసింది. కళ్లు మూసుకుంటే మంచి బహుమతి ఇస్తానని చెప్పి తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో యువకుడు చికిత్స పొందుతున్నాడు. తనకు పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా అతడితో పెళ్లి చేస్తున్నారని యువతి ఆ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. యువకుడు హైదరాబాద్ లోని సీఎస్ఐఆర్ లో పరిశోధకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం





















