Ghazi Parts in Visakha Museum : పాకిస్థాన్ ను ఇండియన్ నేవీ కొట్టిన చావు దెబ్బ | DNN | ABP Desam
1971 యుద్ధం స్వతంత్ర భారత చరిత్రలోనే అతి ముఖ్యమైన సంఘటన.మన నేవీ ఎంత బలమైనదో ప్రపంచానికి చాటి చెప్పిన సంవత్సరం అది. మన దేశానికి చెందిన అతి ప్రతిష్టాత్మక యుద్ధ నౌక INS విక్రాంత్ ను నాశనం చెయ్యడానికి దొంగ చాటుగా పాకిస్తాన్ సబ్ మెరైన్ ఘాజీ వైజాగ్ తీరం వైపు వచ్చింది .దీనిని ముందుగానే పసిగట్టిన ఇండియన్ నేవీ విక్రాంత్ నౌకను మరో చోటుకు తరలించి వేరే యుద్ద నౌక INS రాజ్ పుత్ ను ఘాజీ కోసం రెడీ చేసింది .ఇది తెలియని ఘాజీ విక్రాంత్ తో పాటు విశాఖ నగరాన్ని ధ్వంసం చేసే ప్లాన్ తో విశాఖ తీరానికి చేరుకుంది.అది సరైన టార్గెట్ రేంజ్ కు రాగానే రాజ్ పుత్ దానిపై దాడి చేసింది.ఊహించని ఎటాక్ తో షాక్ కు గురైన పాక్ నేవీ కి చెందిన సెయిలర్స్ ఘాజీ తో పాటే సముద్ర గర్భం లోనే జల సమాధి అయిపోయారు. మరి ఇప్పుడు ఘాజీ ఎక్కడుంది.





















