Viral Video: ఏయ్... పనులు ఆపేయ్... గుత్తేదారుకు వైసీపీ నేత బెదిరింపులు
అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు, వైసీపీ నేత జయరామిరెడ్డి రోడ్డు కాంట్రాక్టర్ పై బెదిరింపులకు దిగారు. రాయదుర్గం-కనేకల్ రోడ్డు పనులు తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కలవకుండా పనులు ఎలా చేస్తున్నారని కాంట్రాక్టర్ ను బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు తప్పవని జయరామిరెడ్డి గుత్తేదారును బెదిరించారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం నల్లంపల్లి గ్రామం నుంచి 14 కిలోమీటర్లు రహదారి నిర్మాణ పనులకు ఆమోదం వచ్చింది. నిర్మాణ పనులకు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. డీఎంసీ సంస్థ ఈ రహదారి పనులు చేపట్టింది. అయితే స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించకుండా పనులు చేపట్టడం ఏంటని వైసీపీ నేత కాంట్రాక్టర్ పై బెదిరింపులకు దిగారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















