VenkataRamiReddy : పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుని చర్చలకు పిలవాలి | ABP Desam
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త పీఆర్సీని రద్దు చేసి ఉద్యోగుల తో చర్చలు జరిపి అందరికీ న్యాయం చేయాలని పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి అన్నారు. కర్నూల్ లో పీఆర్‌సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తున్న ఉద్యోగులకు వెంకట్రామిరెడ్డి సంఘీభావం తెలిపారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి ఉద్యోగ సంఘాల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పీఆర్సీని అమలు చేస్తోందని...దాని వల్ల జీతాలు ఎంత పెరిగాయో తెలియనంతగా ఉద్యోగులు లేరని ఆయన అన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగులకు ఇవ్వాలని ప్రభుత్వం తమతో చర్చలు జరపాలని, ఉద్యోగులకు నష్టం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.





















