Central Teams: వరదల నష్టం అంచనా వేసేందుకు తిరుపతిలో కేంద్ర బృందాల పర్యటన
భారీ వర్షాల వలన చిత్తూరు జిల్లాలో జరిగిన నష్టాలను పరిశీలించేందుకు జిల్లాకు చేరుకున్న ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ లో వివిధ శాఖలలో జరిగిన నష్టాలను తెలియజేసే ఫోటో ఎగ్జిబిషన్ పరిశీలించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యాన, పశు సంవర్ధక శాఖలు, ఇరిగేషన్, పంచాయత్ రాజ్, ఆర్ అండ్ బి, ట్రాన్స్ కో, ఆర్ డబ్ల్యు ఎస్, హౌసింగ్, తదితర శాఖాధికారులు నవంబర్ లో జిల్లాలో సంభవించిన వరదల వలన జరిగిన నష్టాలను కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలో తుఫాను బాధితులకు అందించిన సహాయ సహకారాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, నిత్యావసర సరుకుల పంపిణీ మరియు తుఫాను సంభవించిన ప్రాంతాలలో మంత్రుల పర్యటనను తెలియజేసే ఫోటోలను ప్రదర్శించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ జిల్లాలో శాఖల వారీగా సంభవించిన నష్టాలను, వాటి తాత్కాలిక మరియు శాశ్వత పునరుద్ధరణకు కావలసిన అంచనాలను కేంద్ర బృందానికి వివరించారు.