Payyavula Kesav: వైస్సార్సీపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఏపీలో విద్యుత్ కొరత
రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపులేనితనమే కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రధానికి లేఖ రాశారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు తప్పయితే, వైసీపీ ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి 10 వేల మెగావాట్ల విద్యుత్ ఎందుకు కొంటుందని ప్రశ్నించారు. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న హిందూజా సంస్థను మూతపడేలా చేసిన ప్రభుత్వం అదానీ సంస్థ నుంచి అధిక ధరకు విద్యుత్ ఎందుకు కొనుగోలుచేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.12 వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆ భారాన్ని కూడా ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేసిందని ఆరోపించారు.





















