Singer Mangli Emotional Murali naik Parents | మురళీనాయక్ కుటుంబసభ్యులకు మంగ్లీ పరామర్శ | ABP Desam
పాక్ కాల్పులకు తెగబడుతూ విధులు నిర్వర్తిస్తూనే అమరుడైన తెలుగు వీరుడు మురళీ నాయక్ కుటుంబాన్ని ప్రముఖ గాయనీ మంగ్లీ పరామర్శించారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన మురళీ నాయక్ త్యాగానికి దేశమంతా తలవంచుతుండగా, ఆయన కుటుంబానికి మద్దతుగా మంగ్లీ స్వయంగా వెళ్లి సానుభూతి తెలిపిన ఘటన ప్రజలను ఎంతగానో హృదయాన్ని తాకుతోంది. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాలో నివాసమున్న మురళీ నాయక్ ఇంటికి చేరుకున్న మంగ్లీ, అతని తల్లితండ్రులతో కలిసి కాసేపు కూర్చుని మాట్లాడారు. మంగ్లీని చూసిన వెంటనే మురళీ తల్లి కన్నీళ్లు ఆపుకోలేక భావోద్వేగానికి లోనయ్యారు. ఆమెను ఓదార్చే ప్రయత్నంలో మంగ్లీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
దేశం కోసం ప్రాణం అర్పించిన మురళీ నాయక్ త్యాగం వృథా కాకూడదని, ఈ గొప్ప త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని మంగ్లీ పేర్కొన్నారు. దేశ సేవే పెద్ద సేవ అని నిరూపించిన మురళీ నాయక్ దేశ గర్వంగా నిలిచారని ఆమె వ్యాఖ్యానించారు. వారి కుటుంబానికి పూర్తిస్థాయి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత సమాజంపై ఉందని స్పష్టం చేశారు





















