అభిమానాన్ని వ్యాపారంగా మలచుకుని ఓ యువకుడి ఉపాధి
అభిమానాన్ని అనేక రకాలుగా చాటుకుంటారు సెలబ్రిటీల అభిమానులు.. కొందరు తమకు నచ్చిన హీరోకు ఫ్లెక్సీలు కడతారు.. పాలాభిషేకాలు చేస్తారు.. కానీ మీరు చూస్తున్నారే ఈ ఆర్జీవీ సూపర్ ఫ్యాన్ తన అభిమాన డైరెక్టర్ పేరుతోనే ఓ హోటల్ పెట్టి స్థానికంగా ఫేమస్ అయ్యాడు.. ఇతని పేరే వెంకటరమణ.. ఇతనే కదాండోయ్.. ఈ యువకుని తల్లి, సోదరుడు ఇలా ఇంటిల్లపాదీ ఆర్జీవీకు వీరాభిమానులే.. ఆయన ఫిలాసఫీకు ఫిదా అయినవారే.. ఓడలరేవు వైపుగా ఎవరైనా కొత్తవారు వెళ్తుంటే బెండమూరులంక సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ రాం గోపాల్ వర్మ ఫొటోతో కనిపించే హోటల్ చూసి టక్కున ఆగిపోతారు.. ఇదేదో బాగుందే ఓసారి చూద్దాం అని లోపలకు వెళ్తే అక్కడ అంతా ఆర్జీవీ ప్రపంచమే కనిపిస్తుంది





















