X
Super 12 - Match 15 - 24 Oct 2021, Sun up next
SL
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 16 - 24 Oct 2021, Sun up next
IND
vs
PAK
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Live Video: కొండపై నుంచి జారిపడి పూజారి మృతి... అనంతపురం జిల్లాలో విషాద ఘటన

By : ABP Desam | Updated : 21 Aug 2021 01:31 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

తరతరాల ఆచారం అసువులు తీసింది. భగవదారాధనలో ఓ అర్చకుడు లోయలో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ దుర్ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. శింగనమల మండలం చిన్న జలాలపురం గ్రామ శివారు కొండల్లోని గుహలో గంపమల్లయ్య స్వామి కొలువుదీరారు. ఈ స్వామిని తరతరాలుగా అప్పా పాపయ్య కుటుంబీకులు మాత్రమే పూజలు నిర్వహిస్తారు. ఇందులో అన్యులకు ప్రవేశం లేదు. 
స్వామిని దర్శించడం ఓ సాహసమే.

అన్యులకు దర్శించే వీలు లేదు

చిన్నజలాలపురం కొండల్లోని శ్రీ గంపమల్లయ్య స్వామికి ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా శనివారాలు స్వామివారికి విశేష పూజలు చేస్తారు. ఇక్కడి గుహల్లో కొలువైన స్వామిని పూజారి తప్ప అన్యులు దర్శించే వీలు లేదు. అక్కడి నుంచే పూజారి అందించే హారతిని కళ్లకు అద్దుకుంటారు. గంప మల్లయ్య కొలువైన కొండ గుహలోకి చేరడం పూజారికి సాహసమనే చెప్పాలి. నిటారుగా ఉన్న ఈ కొండపైకి జాగ్రత్తగా ఎక్కాల్సి ఉంటుంది. అక్కడి నుంచి కొండ మధ్యలోని గుహ వరకు జారుకుంటూ వెళ్లాలి. ఈ క్రమంలో ఏమాత్రం పట్టు తప్పినా కొండ బండరాళ్లను ఢీ కొంటూ లోయలోకి పడిపోకతప్పదు. 

అనూహ్యంగా ప్రమాదం..

ఈ సంవత్సరం కూడా శ్రావణ రెండో శనివారం నాడు, పూజారి పాపయ్య, కొండ శిఖరంపై స్వామివారికి హారతులిచ్చారు. శిఖరం దాకా చేరిన భక్తులు కూడా ఆయనతో పాటు వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం గుహలోని స్వామిని దర్శించుకునేందుకు.. కొండమీది నుంచి జారబోయిన పాపయ్య అదుపు తప్పి, కొండ బండరాళ్లకు కొట్టుకుంటూ.. లోయలో పడి దుర్మణం పాలయ్యాడు. ఈ దుర్ఘటన చూసి భక్తులు హాహాకారాలు చేశారు. దశాబ్దాలుగా ఎన్నడూ లేని రీతిలో ఈ దుర్ఘటన జరగడంతో వారు హతాశులయ్యారు.  ఘటనా స్థలానికి శింగనమల పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో గంపమల్లయ్య స్వామి వారి శ్రావణమాసోత్సవాలు విషాదమయమయ్యాయి.

Also Read: Huzurabad KCR : ఖాళీ చేసి వెళ్లిపోయిన నేతలు.. హుజూరాబాద్‌లోనే ఉండాలంటున్న కేసీఆర్..!

సంబంధిత వీడియోలు

ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు  దాటుతున్న గిరిజన విద్యార్థులు.

ప్రాణాలను పణంగా పెట్టి చదువుకోవడం కోసం వాగులు దాటుతున్న గిరిజన విద్యార్థులు.

Karanam Dharmasri: ఎమ్మెల్యేగారూ.. ఈ సూపర్ టాలెంట్ కూడా ఉందా!

Karanam Dharmasri: ఎమ్మెల్యేగారూ.. ఈ సూపర్ టాలెంట్ కూడా ఉందా!

Pattabhi: జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి

Pattabhi: జైలు నుంచి విడుదలైన టీడీపీ నేత పట్టాభి

Tirupati Theatre Fire: తిరుపతి విఖ్యాత్ థియేటర్ లో అగ్నిప్రమాదం

Tirupati Theatre Fire: తిరుపతి విఖ్యాత్ థియేటర్ లో అగ్నిప్రమాదం

Minister Anil Kumar: ‘కంప్లైంట్ చేయబోమని హామీ ఇచ్చిన తరువాతే దాడికి రండి’

Minister Anil Kumar: ‘కంప్లైంట్ చేయబోమని హామీ ఇచ్చిన తరువాతే దాడికి రండి’
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

T20 WC Ind vs Pak: పాక్‌ మ్యాచ్‌ ముందు కోహ్లీసేనకు కపిల్‌ హెచ్చరిక! అలా చేస్తే ఓడిపోయే ప్రమాదం లేకపోలేదు!

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?

Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?