(Source: ECI/ABP News/ABP Majha)
Police Attack on Peddareddy House | తాడిపత్రి హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ | ABP Desam
ఏపీ ఎన్నికల పోలింగ్ తర్వాత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇందులో భాగంగా ఒకరి వర్గంపై మరొకరు పోలింగ్ తర్వాత రాళ్లు రువ్వుకున్నారు. హింస తీవ్ర రూపం దాల్చటంతో పోలీసులు కలుగు చేసుకొని ఇద్దర్నీ రహస్య ప్రాంతాలకు తరలించారు. కొందరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌ను ధ్వంసం చేయడం వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమైంది. దీనిపైన సీరియసైన కేంద్ర ఎన్నికల సంఘం అనంతపురం పోలీస్ ఉన్నతాధికారులపై బదిలీ వేటు వేసింది. అసలు ఈ గొడవలు కారణం ఏంటని పోలీసులు భావిస్తున్నారు..ప్రస్తుతం తాడిపత్రిలో పరిస్థితి ఎలా ఉంది..ఈ వీడియోలో. జిల్లాలో పోలీసులపై వేటు పడటానికి ప్రధాన కారణాలేంటో కూడా ఈ వీడియో చూద్దాం. కేంద్రబలగాలు మొహరింప చేసి శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read : ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టెలీప్రాంప్టర్ వాడుతున్నారా?