నెల్లూరులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
నెెల్లూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సుబేదారుపేటలోని రోమన్ క్యాథలిక్ మిషనరీ చర్చిలో బిషప్ ఎం.డి. ప్రకాశం ప్రార్థనలు నిర్వహించారు. బాలయేసును ప్రతిష్టించి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. నగరంలోని వి.ఆర్.సి. సెంటర్, బోసుబొమ్మ, బట్వాడిపాళెం, ఫతేఖాన్ పేట ప్రాంతాల్లోని చర్చిలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చర్చిల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి అనిల్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.





















