Narayana Swamy Summoned by SIT | మాజీ మంత్రికు సిట్ నోటీసులు
లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పని చేసిన నారాయణ స్వామికు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ కుంభకోణంపై కూటమి సర్కార్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే వరకు 49 మందిని నిందితులుగా చేర్చారు. అందుతో 11 మందిని సిట్ అధికారులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
అయితే సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కేసులో YSRCP ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి A4 గా సిట్ అధికారులు చేర్చారు. ఏపీలో కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయి అని ... కేసులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు YSRCP ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటానాని అన్నారు YSRCP ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఢిల్లీ నుండి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఎంపీ మిధున్ రెడ్డి రోడ్డు మార్గాన విజయవాడ సిట్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.





















