Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP Desam
దండకారణ్యంలో పోలీసులకు,మావోయిస్టులకు మధ్య కాల్పులు ఆగటం లేదు. ఇటీవలే జరిగిన ఎదురు కాల్పుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు హతమయ్యారు. దేశంలో ఏ మూల మావోయిస్టుల మృతి జరిగినా వినిపించే మొదటి పేరు నంబాల కేశవరావు. 2018లో ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామాతో మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ గా ఎన్నికైన నంబాల కేశవరావు అప్పటి నుంచి మావోయిస్టు పార్టీ ఆపరేషన్స్ ను ఉద్యమన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఇంతకీ ఎవరీ నంబాల కేశవరావు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు. ఆయన కుటుంబసభ్యులు ఎలా ఉన్నారు..కేశవరావు చుట్టూ వచ్చే వార్తలపై వాళ్ల ఉద్దేశం ఏంటీ...ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూడండి. కనిపిస్తున్న ఈ పల్లె సీపీఐమావోయిస్టు చీఫ్..దేశంలోనే పోలీసులు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నంబాల కేశవరావు ఊరు.శ్రీకాకుళం జిల్లా కొటబొమ్మాళి మండలం జీఎన్ పురం. ఇక్కడే నంబాలకేశవరావు అలియాస్ బసవరాజ్ అక్కడ కేశవరావు అలీయాస్ బసవరాజ్ అలియాస్ గగన్నకు కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారు.వరంగల్ నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన నంబాల కేశవరావు. కబడ్డీ ప్లేయర్ కూడా. ఆయన తండ్రి స్కూల్ టీచర్ గా పనిచేసేవారు. కనిపించే ఈ పెద్దావిడ పేరు భారతి. ఈవిడ వరుసకు నంబాల కేశవరావుకు పిన్ని. అయినా ఈవిడే తల్లిగా మారి నంబాల కేశవరావును పెంచి పెద్ద చేశారు. ఈయన నంబాల కేశవరావు సోదరుడు సూర్యనారాయణ. సొంత అన్న కాకపోయినా ఇద్దరూ చిన్నతనంలో కలిసే పెరిగారు. చిన్నతనం అంతా చదువు మీద చాలా శ్రద్ధ చూపించేవాడని...బాగా చదువుకున్నాడని..ఆ రోజుల్లోనే ఎంటెక్ పూర్తి చేశాడని నంబాల కేశవరావు గురించి ఆయన గుర్తు చేసుకున్నారు