బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్
ఏపీలో బెల్టు షాపుల గురించి మాజీ మంత్రి రోజా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. యనమల రామక్రిష్ణుడు సొంత నియోజకవర్గంలోనే మైనర్ బాలుడితో బెల్టు షాపులు నిర్వహిస్తున్నారని రోజా ఆరోపించారు. తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం ఆనూరులో ఈ బెల్టు షాపు ఉందని.. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా.. సిగ్గుచేటు అని రోజా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
‘‘ఇదిగోండి... ఇదెక్కడో కాదు.. టీడీపీ మేథావి యనమల రామకృష్ణుడి గారి సొంత మండలం.. హోంమంత్రి అనిత గారి పక్క నియోజకవర్గంలో.. మైనర్ బాలుడిని పెట్టి బెల్టు షాపు నడిపిస్తున్న దారుణ ఘటన. వైన్ షాపుని తలదన్నేలా ఉంది ఈ బెల్టు షాపు. బెల్టు షాపు కనిపిస్తే.. బెల్టు తీస్తానన్న సీఎం చంద్రబాబు గారు.. నన్ను బెల్టు షాపు ఎక్కడుందో చూపించమన్న హోంమంత్రి అనిత గారు. మీ కోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా.. సార్ ఏపీ పోలీసులు తుని నియోజకవర్గంలోని తొండంగి మండలం ఆనూరులో ఈ బెల్టు షాపు ఉంది. ఇదేనా పవన్ కల్యాణ్ గారు.. మంచి ప్రభుత్వం అంటే సిగ్గుచేటు.’’ అని రోజా ట్వీట్ చేశారు.