అన్వేషించండి
కొవిడ్ నిబంధనలను గాలికొదిలేసిన కర్నూలు కలెక్టరేట్ లోని అధికారులు
కర్నూలు జిల్లాలో కొవిడ్ నిబంధనలను పాటించడంలో అధికారులు విఫలమయ్యారు. అందుకేనేమో జిల్లా వ్యాప్తంగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల ముఖానికి కూడా మాస్కు లేకపోవడంతో ప్రజలు భయపడుతున్నారు. అధికారులే కొవిడ్ నిబంధనలు పాటించకపోతే ఇక ప్రజలకు వ్యాధి గురించిన అవగాహన ఎలా వస్తుందనే ప్రశ్నలు చాలా మందికి ఉన్నాయి.
వ్యూ మోర్




















