Anantapuram Viral Video : కరెంటు కష్టాలపై అనంత రైతు సెల్ఫీ వీడియో వైరల్.. పగటి పూట కరెంటు ఇవ్వాలని సీఎంకి వినతి
రైతులకు పగటి పూటే 9 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. నేడు ఆ హామీని నిలబెట్టుకుంటున్నారా..? ఈప్రశ్నకు లేదనే సమాధానమిస్తోంది అనంతపురం జిల్లా రైతాంగం. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం, వ్యవసాయానికి రాత్రిపూటే విద్యుత్ సరఫరా చేస్తోందని, దీనివల్ల తాము విషపురుగులు, క్రూర జంతువుల బారిన పడుతున్నామని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాత్రి అవుతోందంటేనే భయంతో బిక్కుబిక్కుమంటున్నామనీ అంటోంది. రాత్రిపూట తాము పడుతున్న కరెంటు కష్టాల గురించి, జిల్లాలోని డి.హీరేహాళ్ మండలం బాదనహాళ్ గ్రామానికి చెందిన కుబేర అనే యువరైతు.. చేసిన సెల్ఫీ వీడియో అందరినీ ఆలోచింపచేస్తోంది.



















