కృష్ణా నదికి వందేళ్లలోనే అతిపెద్ద వరద
కృష్ణానదికి గడిచిన వందేళ్లలో కనివినీ ఎరుగుని రీతిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి నీటి మట్టాన్ని చేరుకున్న కృష్ణానది..ప్రకాశం బ్యారేజీ రైలు వంతెనను దాదాపుగా టచ్ చేస్తోంది. ఈ రోజు రాత్రికి మరింత వరదనీరు వచ్చి చేరే అవకాశం ఉండటంతో చరిత్రలోనే అతిపెద్ద వరదను కృష్ణానది చూడనుందని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో కృష్ణానది వద్ద పరిస్థితి ఏంటో ఈ వీడియోలో చూడండి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కూడా అక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిపై కేంద్ర హోంమంత్రితో కూడా మాట్లాడానని తెలిపారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రకటించారు. దీంతో పాటు 40 పవర్ బోట్లు కూడా రానున్నాయని చెప్పారు. సహాయక చర్యల కోసం 10 హెలికాప్టర్ లు కూడా వస్తాయని అన్నారు. ఎక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నా వారిని ఎయిర్ లిఫ్ట్ చేస్తామని, అడిగిన వెంటనే కేంద్రం స్పందించిందని చంద్రబాబు పేర్కొన్నారు.