అన్వేషించండి

Karedu Lands Controversy | కరేడు లో ఏం జరుగుతోంది.. గ్రామస్తుల ఆందోళన ఎవరికీ పట్టడం లేదా.? | ABP

కందుకూరు, సింగరాయ కొండ సమీపంలోని కరేడు గ్రామం మండుతోంది. సారవంత మైనతమ భూములు ఒక కంపెనీ కి కట్టబెడతామంటే ఊరుకోమంటూ అక్కడి రైతులు రోడ్డెక్కారు. బంగారం పండే తమ భూములను వదిలి తామెక్కడకి పోవాలనేది  వారి ప్రశ్న. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం గా ఆక్కడి ప్రజలు ఇటీవల హైవే దిగ్బదం చేయడం తోవిషయం వెలుగులోనికి వచ్చింది. అక్కడి రైతులకు అన్యాయం జరుగుతోంది అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షు రాలు షర్మిల, BYC పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ ఆరోస్తున్నారు.

"కరేడు"  గ్రామం  ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం పరిధి లోకి వస్తుంది.  పలువురు ఎనలిస్ట్ లు, గ్రామ ప్రజలు చెబుతున్న దాని ప్రకారం గత వైసీపీ హయాంలో  సోలార్ ప్యానల్స్ తయారు చేసే ఇండిసోల్ అనే కంపెనీ కోసం పీవీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి 5000 ఎకరాల భూమి ని రామాయపట్నం పోర్టు సమీపం లో కేటాయించింది. అది జగన్ మోహన్ రెడ్డి సన్నిహితుల కంపెనీ అని ప్రజలకు రైతులకు అన్యాయం చేసి భూమిని అప్పజెబుతున్నారు అంటూ వామపక్షాలు, ప్రజలు ఆరోపించారు. తరువాత 2024 ఎన్నికల ముందు ఆ భూ కేటాయింపులను మరింత పెంచారు. యువగళం పాదయాత్ర లో భాగంగా పర్యటన కు వచ్చిన లోకేష్ ఆ సంస్థ జగన్ సన్నిహితులదే అని విమర్శలు చేసారు. అయితే కూటమి అధికారం లోకి వచ్చాక ఆ భూ కేటాయింపు లు ఆపేస్తారని అనుకున్నామని కానీ ఆలా జరగలేదు అని గ్రామస్తులు అంటున్నారు.  రామాయపట్నం సమీపంలో  జగన్ ప్రభుత్వం కేటాయించిన భూముల్ని బీపీసీయెల్ రిఫైనరీ కి కేటాయించడం కోసం వెనక్కి తీసుకుని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులుగా 'కరేడు ' గ్రామం దగ్గర 8000 ఎకరాల పైగా భూమిని ఇండో సోల్ కంపెనీ కి కేటాయించడం ఇప్పుడు వివాదాస్పదం అయింది అంటున్నారు వామ పక్షాలకు చెందిన నేతలు.  అప్పుడు జగన్, ఇప్పుడు కూటమి కేటాయించిన భూములు అత్యంత విలువైన వనీ తాము రెండేసి పంటలు పండించే భూమి ఇదనీ కాస్త లోతు తవ్వితే చాలు నీరు పడే సారవంతమైన భూముల్ని ప్రవేటు కంపెనీ కి కేటాయించడం ఏమిటి అని గ్రామస్తులు అంటున్నారు. ఇదే ప్రాంతం లో ఎన్న అప్ ల్యాండ్ లేదా డ్రై ల్యాండ్ ను పరిశ్రమ కు కేటాయించి తమ భూముల్ని వదిలేయాలనేది తమ డిమాండ్ గా కరేడు గ్రామస్తుడు వెంకటేశ్వర్లు అంటున్నారు.. ఈ డిమాండ్ తోనే వారు మొన్న నేషనల్ హైవే ని దిగ్బంధించడంతో  పరిస్థితి ఉద్రిక్తం గా మారింది. అయితే ప్రభుత్వ అధికారులు వచ్చి వారికి నచ్చజెప్పి తాత్కాలికంగా ఆందోళన ను అదుపు చేయగలిగారు.  ప్రస్తుతానికి గ్రామ సభలు ఏర్పాటు చేసి  అక్కడ రైతులు ప్రజలతో సంప్రదింపులు జరుపుతున్నారు. అటు ఇటుగా  పదివేల మందికి పైగానే  ఈ భూ కేటాయింపు ల వల్ల ప్రభావితం అవుతారని, ముందస్తుగా 4 ఎకరాల భూసమీకరణ కోసం రాత్రికి రాత్రి నోటిఫికేషన్ కూడా ఇచ్చారని స్థానిక ఉద్యమ నాయకుడు  మిరియం శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దీనితో స్థానికంగా పరిస్థితి  ఉద్రిక్తం గా మారింది. ఈ భూ సమీకరణ పై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తమ ఆందోళనను ఉదృతం చేస్తామని వారు అంటున్నారు.   మరోవైపు  ఈ ఆందోళన ప్రభావం కందుకూరు నియోజకవర్గం తో పాటు  కొండేపి,కావలి లాంటి కీలక నియోజకవర్గాల పైనా పడే అవకాశం ఉందని  ఎనలిస్ట్ లు అంటున్నారు . మరివైపు అప్పట్లో భూ కేటాయింపు లు చేసిన వైసిపి గానీ ప్రస్తుతం ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్న కూటమి గాని  ఈ వివాదం పై నోరుమెరపకపోవడం ఏంటని వైఎస్ షర్మిల, రామచంద్ర యాదవ్ లాంటి రాజకీయవేత్తలు  విమర్శలు చేస్తున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chintada RaviKumar: మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మహిళా ఎస్సైపై దౌర్జన్యం.. వైసీపీ నేత చింతాడ రవికుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Mahindra Scorpio N కొనేందుకు రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేస్తే.. ప్రతి నెల EMI ఎంత కట్టాలి
Embed widget