సద్దుమణిగిన జిన్నాటవర్ వివాదం...!
గత నెల రోజులుగా రావ్ట్ర వ్వాప్తంగా జిన్నా టవర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు టౌన్లో జిన్నా టవర్ ఉంది..గుంటూరుతో అనుబంధ ఉన్న వారికి జిన్నా టవర్ సెంటర్ అంటే పెద్ధగా చెప్పవలసిన అవసరం లేదు..మత సామరస్యానికి చిహ్నంగా ఈ టవర్ను భావిస్తారు.. అయితే దేశవిభజనకు కారకుడైన జిన్నా పేరుతో నిర్మించిన ఈ సెంటర్ పేరు మార్చాలి. జిన్నా టవర్ను తొలగించాలని బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.. రిపబ్లిక్ డే రోజున జిన్నాటవర్ పై జాతీయ జండాను ఎగరు వేస్తామని హడావిడి చేసారు.జాతీయ జండాను ఇక్కడ ఎగురవేయడమే కాదు. త్రివర్ణ పతాకం రంగు టవర్ కు వేసేందుకు తీర్మానం చేసారు. వెంటనే రంగులు వేసేందుకు చకచక ఏర్పాట్లు చేశారు. జిన్నా టవర్కు త్రివర్ణ పతాకం కలర్ వేసి వివాదానికి ముగింపు పలికారు.





















