Former MLA Kethireddy Pedda Reddy Arrest | కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్
అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రావడంతో ఆయన్ని అడ్డుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉండే చోట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.
గత ఏడాదికాలంగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చివరకు ఎవరికి చెప్పకుండా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తిరిగి పంపించేసేందుకు ఎంతో ప్రయత్నించారు. ఎంత చెప్పినా వినకపోవడంతో ... ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసు అరెస్టు చేసారు. తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే పెద్దారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని.. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నరు.





















