Fan Made Iconic pic Of Pawan Kalyan | భూతద్దంతో పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసిన అభిమాని
రోజుకు 6 గంటలు ఎండలో.. పవన్ కల్యాణ్‌పై ఇంత అభిమానమా..? భూతద్దంతో పవన్ కల్యాణ్ చిత్రాన్ని గీసిన అభిమాని . సినిమా నటులు, రాజకీయ నాయకుల అభిమానులు.. వాళ్లు అభిమానించే వ్యక్తులపై ఉన్న అభిమానాన్ని ఎవ్వరూ ఊహించని విధంగా చాటుకుంటుంటారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఓ అభిమాని కూడా తన అభిమాన నాయకుడు, జనసేన అధినేత, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోసం ఎవ్వరూ ఊహించని సాహసానికి పూనుకున్నాడు. ఇచ్చాపురం మండలం మండపల్లి గ్రామానికి చెందిన జన సైనికుడు సర్వాన్.. దాదాపు నెల రోజుల పాటు రోజుకు 6 గంటలు ఎండలో ఉంటూ భూతద్దంతో చెక్కపై కాల్చుతూ.. పవన్ కళ్యాణ్ ముఖచిత్రాన్ని గీశారు. ఇచ్చాపురం జనసేనపార్టీ ఇంచార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి రాజు ఈ చిత్రాన్ని రాష్ట్రంలో నలుమూలాల నాయకులకు చూపించడం చూపించగా.. దీనిపై సర్వాన్‌ని రాష్ట్ర నాయకులంతా మెచ్చుకున్నారు. తన ప్రియతమ నాయకుడు పవన్ కల్యాణ్‌కి ఈ చిత్రాన్ని ఇవ్వాలనుకుంటున్నానని సర్వాన్ అన్నాడు.





















