CM Jagan Review On Asani Cyclone: అధికారులకు ఆదేశాలిచ్చిన సీఎం జగన్ | ABP Desam
Asani తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ఎస్పీలతో CM Jagan సమీక్ష నిర్వహించారు. అసని తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని సీఎం అన్నారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలిచ్చారు. తీర ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నిధులు విడుదల చేశామని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అవసరమైన చోట సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సహాయక శిబిరాలకు తరలించిన వ్యక్తికి వెయ్యి రూపాయలు, కుటుంబానికి 2వేల రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపడుతున్నట్టు హోంమంత్రి తానేటి వనిత తెలిపారు





















