150 thefts thief caught : 58 కేసుల్లో నిందితుడిగా ఉన్న దొంగ అరెస్ట్ | Chittoor | ABP Desam
తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఓ ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. చిత్తూరు పోలీసు గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పి రిశాంత్ రెడ్డి ఇటివల వరుసగా చిత్తూరు, కార్వేటినగరంలో నమోదైన వరుస దొంగతనలు, చైన్ స్నాచింగ్ కేసులను చేధించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన దర్యాప్తు చేశామన్నారు. దర్యాప్తులో మోస్ట్ వాంటెడ్ అంతరాష్ట్ర దొంగ తిరువీధుల మహేష్ పోలీసులకు చిక్కినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి 500 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. 12ఏళ్ల వయస్సు నుంచే నిందితుడు దొంగతనాలు చేస్తుండగా..ఇప్పటికి 150 దొంగతనాలు చేసి...58 కేసుల్లో నిందితుడిగాఉన్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వివరించారు.





















