బుడమేరును బెజవాడ దు:ఖదాయని అని ఎందుకంటారు?
విజయవాడను భారీ ముంపునకు గురి చేసిన బుడమేరు ప్రజల జీవితాల్లో బురదనే నింపింది. లోతట్టు ప్రాంతాలన్నీ బుడమేరు ఉద్ధృతికి జలమయమైపోగా అసలు ఈ స్థాయిలో విపత్తకు కారణం ఎవరు..? ఈ వీడియోలో డీటైల్డ్ గా చూడండి. మరోవైపు బుడమేరు వరద బాధితుల కష్టాలు తీరే వరకు ఇక్కడే ఉంటానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రజలను కాపాడటం, వారికి భరోసా ఇవ్వడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. 1998 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వర్షాలు పడటం ఇదే మొదటిసారి అని, కాబట్టి విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వరద నష్టంపై కేంద్రాన్ని సాయం కోరుతామని కూడా అన్నారు. నేడు, రేపు విజయవాడ కలెక్టరేట్ లోనే ఉంటానన్న సీఎం చంద్రబాబు నాయుడు నిద్రహారాలు మానైనా ప్రజల్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బుడమేరుకు మునుపెన్నడూ లేని స్థాయిలో ఎక్కువగా వరద నీరు రావడంతో సింగ్ నగర్ ప్రాంతం ముంపునకు గురైందని తెలిపారు