Kurnool: కర్నూలు కలెక్టరేట్ వద్ద బంగారుపేట వాసుల ఆందోళన
కర్నూలు కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగారుపేటలో కేసీ కెనాల్ వెంట ఉన్న ఇళ్లను అక్రమ నిర్మాణాలని మున్సిపల్ అధికారులు జేసిబీలతో కూల్చే శారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమకు ముందస్తు సమాచారం లేకుండా ప్రత్యామ్నాయం చూపకుండా ఇల్లు ఎలా తొలగిస్తారని స్ధానికులు మున్సిపల్ సిబ్బందిని అడ్డు కున్నారు. అయినప్పటికీ అధికారులు ఇళ్లు తొలగిం చారు. ఇళ్లు కోల్పోయిన మేము ఎక్కడ నివాసం ఉండాలని బంగారు పేట వాసులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. కలెక్టరేట్ లోకి వెళ్ళేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ తమకు ఇళ్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చేంత వరకూ కదలమని కలెక్టరేట్ మెయిన్ గేటు వద్ద బైఠాయించారు. నగర శివార్లలో ఇళ్ళు ఏర్పాటు చేస్తామని చెప్పడం తో ఆందోళన విరమించారు.





















