KURNOOL : అలనాటి రాచరిక సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది
విజయదశమి రోజున కర్నూలు జిల్లా మద్దికేర గ్రామంలో గుర్రాల స్వారీ నిర్వహిస్తారు. అలనాటి రాజవంశీకులు లకు చెందిన పెద్ద నగిరి, చిన్న నగిరి, యామనగిరి మూడు కుటుంబాలు విజయదశమి రోజున వీరు పెద్దలు కట్టించినటువంటి బొజ్జ నాయన పేట లోనే ఉన్న భోగేశ్వర ఆలయములో మూడు కుటుంబాలు కు సంబంధించిన వంశీకులు పూజలు చేసుకొని అక్కడనుండి గుర్రాలపై మూడు కిలోమీటర్లు స్వారీ చేస్తూ మద్దికెర కు ఎవరు ముందుగా వస్తారో ఆ వంశీకులు విజయం సాధించినట్టు ప్రకటిస్తారు. యాదవ వంశీకులు గుర్రాలపై కూర్చొని స్వారీ చేస్తూ తమ రాచరిక ఠీవి ప్రదర్శిస్తారు. యాదవ రాజులు గుర్రాలపై తరలి వెళ్ళే తప్పుడు వీరికి మద్ది అనే కులస్తులు సైన్యము వలె ఆయుధాలు ధరించి అంగరక్షకులు కూడా ఉంటారు.



















