Anaparthi MLA Ramakrishna Reddy | రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది
డబుల్ ఇంజన్ సర్కార్ తో రాష్ట్రానికి మంచి జరుగుతుందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి జరుగుతుందని అన్నారు అనపర్తి ఎమ్మెలే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి . కేంద్రంలోని, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి డబల్ ఇంజన్ సర్కార్ గా సుపరిపాలనందిస్తుందని అనపర్తి ఎమ్మెల్యే, బిజెపి నాయకుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని.. రెడ్ బుక్కు రాజ్యాంగం అంటూ ఏమీ లేదు అన్నారు.. తనకు ఎవరికైనా కక్ష సాధించే ఉద్దేశం లేదని, అనపర్తి నియోజకవర్గం లో అన్ని వర్గాలను కలుపుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి . అనపర్తి నియోజకవర్గం లోని బలబద్రపురంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని.. ఇక్కడ నేషనల్ రేషియో కంటే ఎక్కువే కేసులు ఉన్నాయన్నారు. గ్రాసిం ఇండస్ట్రీపై తను వెనక్కు తగ్గలేదని, పోరాటం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తో ఫేస్ టూ ఫేస్.




















