News
News
X

Zomato: చంటిపాపతో పుడ్ డెలివరీ, మహిళ పనికి నెటిజన్ల హ్యాట్సాఫ్.. జొమాటో ఏమన్నదంటే?

వీపుకు చిన్నపాప, పక్కనే చిన్న అబ్బాయి.. అమ్మ జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్. వీరి గురించి ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జొమాటో స్పందించి.. ఆ పిల్లలకు సాయం ప్రకటించింది.

FOLLOW US: 

కొంత మంది తమకు పని దొరకడం లేదంటారు. మరికొంత మంది తమ స్థాయికి తగిన ఉద్యోగం లేదంటారు. పలు కారణాలు చెప్తూ చాలా మంది ఖాళీగా కూర్చుంటారు. కానీ, కొందరు ఇంకోలా ఉంటారు. దొరికిన పనిని ఎంతో ఇష్టంతో చేస్తారు. ఏ పని చేస్తున్నాం అని కాదు.. చేసే పని ఎంత బాగా చేస్తున్నాం అనేదే ముఖ్యం అంటారు. ఇందుకు నిదర్శనం ఈ  మహిళా జొమాటో ఫుడ్ డెలివరీ ఏజెంట్. పని మీద తనకు ఎంత రెస్పెక్ట్ అంటే.. చంటి  పాపను.. వీపుకు కట్టుకుని మరీ వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఆమెకు చిన్న బాబు కూడా సహకారం అందిస్తున్నాడు.

అసలే పేద కుటుంబం. పైగా ఇంటి భారం తనే మోస్తోంది. ఎలాగోలా జొమాటోలో ఫుడ్ డెలివరీ చేసే పనికి కుదిరింది. పిల్లలను చూసుకుంటూనే పని చేసుకుంటుంది. తాజాగా ఈ మహిళ ఫుడ్ డెలివరీ చేస్తుండగా.. ఫుడ్ బ్లాగర్ సౌరభ్ పంజ్వానీ చూశాడు. వెంటనే వీడియో తీశాడు. తను ఆర్డర్ చేసిన ఫుడ్ తీసుకొని వచ్చిన మహిళను చూసి ఆశ్చర్యపోయాడు. చేతిలో ఫుడ్ పార్సిల్, నడుముకు చిన్నారి.. వెంటనే మరో చిన్న బాబును చూసి అవాక్కయ్యాడు.  వెంటనే తనతో మాటలు కలిపాడు. ఆమెకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నాడు. ఆమె కూడా తన పనికి సంబంధించిన వివరాలను చెప్పింది. ఇంటి దగ్గర ఎవరూ ఉండరని.. అందుకే తను పసి బిడ్డను వెంట తీసుకునే ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్తున్నట్లు చెప్పింది. పసిపాపనే కాదు.. తన బాబు కూడా వెంటే వస్తాడని చెప్పింది. అతడు కూడా ఫుడ్ డెలివరీలో సాయం చేస్తాడని చెప్పింది.

ఈ వీడియోను సౌరభ్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశాడు. ఆమెను చూసి తాను ఎంతో స్ఫూర్తి పొందినట్లు వెల్లడించాడు. జొమాటో డెలివరీ మహిళ తన ఇద్దరు పిల్లలతో రోజంతా ఎండలో కష్టపడి పని చేస్తుందని చెప్పాడు. పని చేయాలనే తపన ఉంటే ఎవరు ఏ పనైనా చేయగలరు అనడానికి ఈమె జీవితమే నిర్శనం అని చెప్పుకొచ్చాడు.

View this post on Instagram
 
A post shared by Saurabh Panjwani (@foodclubbysaurabhpanjwani)

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎంతో మంది మహిళపై ప్రశంసలు కురిపించారు. ఇద్దరు పిల్లల కోసం తల్లిపడుతున్న కష్టాన్నిఎంతో కొనియాడారు. పనిలేదని సోమరిపోతుల్లా తిరిగే వారికి ఈ జొమాటో మహిళ ఆదర్శం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతుంది. ఈ వీడియోపై ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో కూడా స్పందించింది. సదరు మహిళ పిల్లల బాగోగులు చూసుకునేందుకు ముందుకు వచ్చింది. ఆ పిల్లలకు మంచి జీవితాన్ని అందించేందుకు సహాయం చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే సదరు మహిళను సంప్రదించి వివరాలు అడిగి తెలుసుకున్నది. త్వరలోనే పిల్లల చదువు సహా పలు అవసరాలకు సహకారం అందించనున్నట్లు తెలిపింది.  

Also Read: ఈ హోటల్ కేవలం పందులకే - ఫుల్ సెక్యూరిటీ, వైద్యుల పర్యవేక్షణతో లగ్జరీ లైఫ్!

Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!

Published at : 23 Aug 2022 04:30 PM (IST) Tags: food blogger Zomato Viral video Zomato delivery agent Saurabh Panjwani

సంబంధిత కథనాలు

Viral Video: పాముకు ముద్దు పెట్టబోయిన స్నేక్ క్యాచర్, తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ !

Viral Video: పాముకు ముద్దు పెట్టబోయిన స్నేక్ క్యాచర్, తరువాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ !

Viral Pic: అనసూయ బాటలో ఉబర్ క్యాబ్ డ్రైవర్, మాటల్లేవ్ ఆ బోర్డే చెప్పేస్తుంది!

Viral Pic: అనసూయ బాటలో ఉబర్ క్యాబ్ డ్రైవర్, మాటల్లేవ్ ఆ బోర్డే చెప్పేస్తుంది!

Viral Video: పీక నొక్కుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ- విద్యార్థిపై టీచర్ ప్రతాపం!

Viral Video: పీక నొక్కుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ- విద్యార్థిపై టీచర్ ప్రతాపం!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Lottery : లక్కీ బర్త్ డే, పుట్టిన రోజు డేట్‌తో 200 లాటరీ టికెట్లు కొన్నాడు, ఏకంగా జాక్‌పాట్ కొట్టేశాడు!

Spoons in Stomach: అరె, అది కడుపా? స్టీల్ సామాన్ల షాపా? వ్యక్తి కడుపులో 63 స్పూన్లు - డాక్టర్లు షాక్!

Spoons in Stomach: అరె, అది కడుపా? స్టీల్ సామాన్ల షాపా? వ్యక్తి కడుపులో 63 స్పూన్లు - డాక్టర్లు షాక్!

టాప్ స్టోరీస్

Etela Rajender : వీఆర్ఏల శవాల మీద విమానం కొంటారా?, టీఆర్ఎస్ కు వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది- ఈటల రాజేందర్

Etela Rajender : వీఆర్ఏల శవాల మీద విమానం కొంటారా?, టీఆర్ఎస్ కు వందల కోట్ల ఫండ్ ఎలా వచ్చింది- ఈటల రాజేందర్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఆరోహి ఎలిమినేషన్, వెక్కి వెక్కి ఏడ్చేసిన సూర్య - ఆదివారం ఎపిసోడ్ హైలైట్స్!