Shortest Resignation letter: సూటిగా సుత్తి లేకుండా, రిజిగ్నేషన్ లెటర్స్‌లో నయా ట్రెండ్ ఇదే
సోషల్ మీడియాలో షార్టెస్ట్ రిజిగ్నేషన్ లెటర్స్ వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ఇండియా కూడా ఓ లెటర్‌ని షేర్ చేసింది.
![Shortest Resignation letter: సూటిగా సుత్తి లేకుండా, రిజిగ్నేషన్ లెటర్స్‌లో నయా ట్రెండ్ ఇదే YouTube India's short and crisp resignation letter wins Internet's approval. Tweets are hilarious Shortest Resignation letter: సూటిగా సుత్తి లేకుండా, రిజిగ్నేషన్ లెటర్స్‌లో నయా ట్రెండ్ ఇదే](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/25/8df42bc96ecf0213ba26afee37f27d1a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నెట్టింట వైరల్ అవుతున్న రిజిగ్నేషన్ లెటర్స్ ఇవే..
ఈ మధ్య రిజిగ్నేషన్ లెటర్స్ రాయటంలోనూ క్రియేటివిటీ చూపిస్తున్నారు కొందరు ఉద్యోగులు. సింపుల్‌గా సుత్తి లేకుండా డైరెక్ట్ మ్యాటర్‌కి
వచ్చేస్తున్నారు. ఇప్పుడిదే ఓ ట్రెండ్‌గా మారిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి సింపుల్ రిజిగ్నేషన్ లెటర్స్ బాగానే వైరల్అవుతున్నాయి. ఆ మధ్య "షార్టెస్ట్ రిజిగ్నేషన్ లెటర్" అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఓ రాజీనామా లేఖ తెగ వైరల్ అయింది. అది చూసి నెటిజన్లు విరగబడి నవ్వుకున్నారు. వేలాది మంది రీట్వీట్ చేశారు. ఇప్పుడు మరో రిజిగ్నేషన్ లెటర్ కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.అది ఎంత ఫేమస్ అయిందంటే యూట్యూబ్ ఇండియా తన ట్విటర్ హ్యాండిల్‌లో షేర్ చేసేంతగా. యూట్యూబ్ ఇండియా "నైస్ రిజిగ్నేషన్ లెటర్" అనే క్యాప్షన్ ఇస్తూ ఓ లెటర్‌ని షేర్ చేసింది. అప్పటి నుంచి ఈ ట్వీట్ వైరల్ అయిపోయింది. ఇప్పటికే 9 వేల మంది లైక్ కొట్టారు.
భారత్‌లో బాగా పాపులర్ అయిన కంటెంట్ క్రియేటర్ గౌరవ్ చౌదరి, తన ప్రతి వీడియోని స్టార్ట్ చేసే ముందు "చలో షురూ కర్తే హై (ఇక మొదలు పెడదాం) " అని అంటూ ఉంటారు. ఓ వ్యక్తి ఇదే డైలాగ్‌ని రిజిగ్నేషన్ లెటర్‌లో రాసే సరికి అది కాస్తా వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగాయూట్యూబ్ ఇండియానే షేర్ చేశాక రీచ్ బాగా పెరిగింది. ఆ వైరల్ అవుతున్న రిజిగ్నేషన్ లెటర్స్‌కి నెటిజన్లు ఎలా స్పందిస్తున్నారో చూడండి.
nice resignation letter pic.twitter.com/qhYo3quPA7
— YouTube India (@YouTubeIndia) June 23, 2022
meanwhile us to @TechnicalGuruji’s video: chaliye shuru karte hai
— YouTube India (@YouTubeIndia) June 23, 2022
Me to YouTube, after getting an unskippable ad: https://t.co/1k5LgY0dSY
— abhi changer (@abhichanger) June 23, 2022
nice resignation letter pic.twitter.com/qhYo3quPA7
— YouTube India (@YouTubeIndia) June 23, 2022
Short and sweet. pic.twitter.com/KYXYgeq2tl
— Kaveri 🇮🇳 (@ikaveri) June 14, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)