Viral News : పుచ్చకాయలను నుజ్జు నుజ్జు చేస్తే గిన్నిస్ బుక్‌లో చోటు- అమ్మో ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయా!
Guinness World Record : గోజ్డే డోగన్ అనే మహిళ నిర్ణీత సమయంలో కేవలం తన థైస్‌తో పుచ్చకాయలను నుజ్జు నుజ్జు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

Guinness World Record : అద్భుతమైన విన్యాసాలు, అద్భుతమైన విజయాలు సాధించిన వారికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. కేవలం ఒక వర్గం, రంగానికే పరిమితం కాకుండా.. ఆహార సంబంధిత రికార్డులు, ఎత్తైన కేక్ స్టాక్ నుంచి మహోన్నతమైన ఎత్తులకు చేరుకోవడం, వెయ్యి చదరపు మీటర్లకు పైగా విస్తరించిన అతి పెద్ద పిజ్జా వరకు, ఒక నిమిషంలోపు సూపర్-స్పైసీ భోజనాన్ని పూర్తి చేయడం వంటి రికార్డులు ఇప్పటివరకు విస్మయం కలిగించాయి. కానీ కొన్నిసార్లు సాధ్యంకానివనిపించినవి కూడా చేసి రికార్డ్ బ్రేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టర్కీకి చెందిన ఓ మహిళ కూడా అదే విషయాన్ని చేసి చూపించింది. కేవలం ఒక్క నిమిషంలోనే తన తొడలతో అత్యధిక పుచ్చకాయలను నుజ్జు చేసి రికార్డు సృష్టించింది.
మునుపటి రికార్డ్ బ్రేక్ చేసిన మహిళ
గతేడాది ఫిబ్రవరి 5న ఇటలీలోని మిలన్‌లో జరిగిన లో షో డీ రికార్డ్ సెట్‌లో గోజ్డే డోగన్ అనే మహిళ 5 పుచ్చకాయలను చూర్ణం చేసింది. ఇదే విమెన్స్ లో అత్యధికం. కొన్ని రోజుల క్రితం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీ, ఈ మహిళ చేసిన ఫీట్ వీడియోను పోస్ట్ చేసింది. "గోజ్డే డోకాన్ ఒక్క నిమిషం(ఫిమేల్)లోనే 5 పుచ్చకాయలను తన తొడలతో నలిపేసింది" అని క్యాప్షన్ లో రాసింది.
Most watermelons crushed with the thighs in one minute (female) - 5 achieved by Gözde Doğan 🇹🇷 pic.twitter.com/X6jyAJQCGi
— Guinness World Records (@GWR) January 17, 2025
ఈ వీడియోకు నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ఓజీ వాటర్ మిలాన్ క్రషర్ అని కొందరు పిలవగా.. గొప్ప విజయం అని ఇంకొందరు ప్రశంసించారు. ఆ తర్వాత గోజ్డే డోగన్ కూడా తన గెలుపుపై స్పందించింది. ఈవెంట్ నుండి రెండు వీడియోలను పంచుకుంది. దాంతో పాటు “గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అలర్ట్!! ఇప్పుడు నా పేరు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఉంది! కేవలం కాళ్లను ఉపయోగించి 1 నిమిషంలో అత్యధిక పుచ్చకాయలను బద్దలు కొట్టిన రికార్డును నేను కలిగి ఉన్నాను! దీన్ని 1 నిమిషంలో చేయడం అంత సులభమేం కాదు. కానీ నాకు ఆహ్మానం వచ్చినప్పుడే అనుకున్నాను.. నేను ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తానని. టర్కీలో అత్యంత బలమైన మహిళగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, నాకు వసతి కల్పించినందుకు, ప్రోగ్రామ్ అంతటా నా ప్రతి విషయాన్నీ చూసుకున్నందుకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞురాలిని. మళ్లీ కొన్ని రికార్డులను బద్దలు కొట్టడానికి మళ్లీ అక్కడికి వెళ్లేందుకు ఎదురు చూడకుండా ఉండలేకపోతున్నాను అని రాసింది.
Sieh dir diesen Beitrag auf Instagram an





















