Woman Dance Video: చుట్టూ కుక్కలు…మధ్యలో డాన్స్..ఎందుకిలా చేసింది?
అప్పట్లో షోలే మూవీ ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆ మూవీని గుర్తుచేసింది ఓ యువతి. ఎందుకో తెలియాలంటే ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోపై ఓ లుక్కేయండి...
![Woman Dance Video: చుట్టూ కుక్కలు…మధ్యలో డాన్స్..ఎందుకిలా చేసింది? Woman Dancing in Front of Dogs inspiring Sholay Movie basanti song Woman Dance Video: చుట్టూ కుక్కలు…మధ్యలో డాన్స్..ఎందుకిలా చేసింది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/19/ac2686467d7abcc49b3e50f8d18fa356_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
చుట్టూ కుక్కల మధ్య ఓ యువతి డాన్స్ ఇరగదీసింది.ఆ వీడియో చూడాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి...
https://twitter.com/rupin1992/status/1416284014764199938?ref_src=twsrc%5Etfw
ఈ పాటేంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. 1975 బాలీవుడ్ సన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ షోలే ఎంత పెద్ద హిట్టో... అందులో బసంతి పాత్రలో నటించిన హేమామాలినీ ఓ పాటలో వేసిన డాన్స్ కూడా అంతే హిట్టు. ఆ పాటని ప్రేరణగా తీసుకుని ఓ యువతి... నడి రోడ్డుపై కుక్కల మధ్యలో డాన్స్ వేసింది.
ఇంతకీ నడిరోడ్డుపై డాన్స్ వేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? షేలే పాటకి మాత్రమే ఎందుకు డాన్స్ చేసిందని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. దీనికి సమాధానం తెలియాలంటే షోలే సినిమాలో ఆ సీన్ గురించి తెలియాలి మరి.
షోలే మూవీలో ఓ సీన్ లో విలన్ గబ్బర్ సింగ్…. నీ లవర్ వీరూని చంపకూడదంటే... మాముందు డాన్స్ వెయ్యి" అని బసంతి ని ఆదేశిస్తాడు. ఆగ్రహంలో రగిలిపోయిన హీరో వీరూ…కుక్కల ముందు డాన్స్ చేయొద్దంటాడు. రెచ్చిపోయిన విలన్ గబ్బర్ సింగ్ బీర్ బాటిళ్లు పగులగొట్టి ఆ గాజు పెంకులపై డాన్స్ చేయమంటాడు. బసంతి ఆ గాజుపెంకులపై డాన్స్ చేసి విలన్ పై తన కోపాన్ని ప్రదర్శిస్తుంది. అప్పట్లో ఆ సీన్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అప్పుడు విలన్స్ ని కుక్కలు అని హీరో అంటే….ఇప్పుడీ యువతి ఆ పాట ప్రేరణతో నిజంగా కుక్కల మధ్యలో డాన్స్ చేసింది. షోలేలో అదే పాటని ఎంపికచేసుకుని కుక్కల మధ్య స్టెప్పులేసింది.
ఈ వీడియోని IPS ఆఫీసర్ రూపిన్ శర్మ ట్విట్టర్‌లో షేర్ చేశారు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది….
Basanti इन कुत्तों के सामने ...☺️😊😊😊😊
— Rupin Sharma IPS (@rupin1992) July 17, 2021
Basanti kutton ke saamne naachin....☺️☺️😊😊 pic.twitter.com/rtn4r8PpMw
వాస్తవానికి కుక్కలు కరవడానికి వచ్చినప్పుడు చలనం లేకుండా ఆగిపోతే ఏమీ అనవు కానీ…పరిగెత్తినా, నడిచినా ..ఇంకా ఎలాంటి చలనం ఉన్నా ఎటాక్ చేస్తాయి. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కుక్కల ముందు యువతి చిందులు తొక్కినా అవి మాత్రం చూస్తూ ఎంజాయ్ చేసినట్టే ఉన్నాయ్. ఈ కుక్కలు డాన్స్ లవర్స్ అయి ఉంటాయని ట్వీట్ చేశారు రూపిన్ శర్మ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. కుక్కలు ఈ డాన్స్‌ని బాగా ఎంజాయ్ చేశాయని ఒకరు… గబ్బర్ సింగ్ లేడు కాబట్టి నువ్వు కుక్కల దగ్గర పాడినా, డాన్స్ చేసినా ఏం కాదని మరొకరు కామెంట్స్ పెట్టారు. మొత్తానికి ఆ లొకేషన్ ఎక్కడన్నది మాత్రం క్లారిటీ లేదు. కానీ ఆ పాటకి డాన్స్ ని చూసి మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు....
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)