అన్వేషించండి

Strange Foods: చేప కన్నుల కూర, సాలె పురుగుల ఫ్రై - ఈ వింతైన వంటకాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే

Strange Foods: ప్రపంచవ్యాప్తంగా విచిత్రమైన ఆహారాలు ఉంటాయి. సాలెపురుగులు, చేప కళ్లు, చికెన్ బట్స్ లాంటివి వండుకుని తింటారని తెలుసా?

Strange Foods: ఆహార అలవాట్లు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. ఈ ఆహారపు అలవాట్లు చూస్తే కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ప్రాంతాలను బట్టి సంస్కృతి సాంప్రదాయాలు మారినట్లే.. ఆహార అలవాట్లు కూడా మారుతుంటాయి. శాఖాహారమైనా, మాంసాహారమైనా కొన్ని విచిత్రంగా అనిపించవచ్చు. తినే వారికి వింతగా అనిపించకపోయినా, కొత్తగా చూసే వారికి అలా అనిపించడానికి అవకాశం ఉంది. చైనా లాంటి దేశాల్లో కప్పలు, పాములు, తేళ్లు, జెర్రీలు లాంటి పాకే జంతువులు, ఎగిరేవి, పరుగెత్తేవి ఇలా చాలా వాటిని తింటుంటారు. అలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని వింతైన వంటకాలు ఏంటో ఇప్పుడో లుక్కేద్దాం.

పైనాపిల్ శాండ్‌విచ్‌

ఈ స్నాక్ పైనాపిల్ పండ్లతో తయారు చేస్తారు. ఇది ఒక విచిత్రమైన అల్పాహారం. అమెరికాలోని ప్రజలు పైనాపిల్ తో శాండ్‌విచ్‌ లు తయారు చేసుకుని తింటారు. ఇది రెండు రొట్టే ముక్కల మధ్య పైనాపిల్ ను, మయోని నింపి తయారు చేస్తారు.

ట్యూనా ఐబాల్స్

ఇప్పటి వరకు చేపలను మాత్రమే తినే వారిని మీరు చూసుంటారు. కానీ అసహ్యకరంగా కనిపించే ఈ ట్యూనా ఐబాల్స్ అల్పాహారం జపాన్, చైనా దేశాల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ అల్పాహారం ట్యూనా చేపల కళ్లను వేయించి తయారు చేసే వంటకం. దీన్ని మోమోస్ లాగా ఉడికించి, వెల్లుల్లి, నిమ్మ, సోయా సాస్ తో కలిపి తింటారు.

వేయించిన టరాన్టులా

ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు సాలె పురుగులను చూస్తే అసహ్యించుకుంటారు. ఇంట్లో సాలె గూళ్లను తీసి పారేస్తుంటారు. అయితే కంబోడియాలో టరాన్టులా సాలె పురుగులను వేయించి తింటారు. 1970లలో, పోల్ పాట్ అనే నియంత కాలంలో కంబోడియాలో ఆహారం, పానీయాల కొరత ఏర్పడినప్పుడు.. ప్రజలు తమ ఆహారాల్లో ఈ వేయించిన టరాన్టులాను భాగం చేసుకున్నారు. రాను రాను ఇది అలవాటుగా మారిపోయింది.

సాలో

ఉక్రెయిన్ లో సాలో అనే వంటకం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వంటకం పంది కొవ్వుతో తయారు చేస్తారు. ప్రజలు వోడ్కా షాట్ లతో పచ్చిగా తినడానికి ఇష్టపడతారు.

చికెన్ బట్

తైవాన్ లో చికెన్ బట్ అనే వంటకం తెగ తింటారు. ఈ వంటకం చికెన్ వెనక భాగం అంటే మలం వచ్చే ద్వారాన్ని వేయించి తయారు చేస్తారు. 

మొసలి మాంసం

ఆస్ట్రేలియాలో, మొసలి మాంసాన్ని ఎక్కువగా తింటుంటారు. జెర్కీ లేదా సాసేజ్ తో పాటు ఈ మొసలి మాంసాన్ని తీసుకుంటారు. ఇది చికెన్, చేపల మాదిరి టేస్ట్ కలిగి ఉంటుంది.

కోపి లువాక్ కాఫీ

ఇండోనేషియాలో, కోపి లువాక్ కాఫీని తాగుతుంటారు. ఈ కాఫీని సివెట్ లు మొదట తింటాయి. అనంతరం మలం ద్వారా బయటు వచ్చిన తర్వాత ఈ కోపి లువాక్ కాఫీని తయారు చేస్తుంటారు. బీన్స్ ను పులియబెట్టి కాల్చిన తర్వాత, కాఫీ మెత్తగా, రుచిగా ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఇవి మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అనేక ఆహారాలు, అల్పాహారాలు వింతైన జీవరాశులతో తయారు చేసుకుని తింటుంటారు. అయితే ఇది కొత్త వారికి మాత్రమే వింతగా అనిపించినా, స్థానికులు మాత్రం ఇష్టంగా తింటారు.

టాప్ హెడ్ లైన్స్

Viral Video: అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
అమ్మ పెళ్లి చేస్తుందని గుండు చేయించుకున్న అమ్మాయి! వీడియో వైరల్‌! యూజర్ల షాకింగ్ రియాక్షన్ 
Why Europe Is Heating Up?: యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
యూరోప్ ఎందుకు ఓవెన్‌లా ఉడుకుతోంది..తీవ్రమైన ఎండల వెనుక కారణం ఏంటి..? 
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?
గ్యాస్ సిలెండర్లు బ్లాస్ట్ అవుతాయా..? సినిమాల్లో చూపించినట్లు యాక్సిడెంట్ అయితే లారీల్లో నుంచి గాల్లోకి లేస్తాయా..?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
ఈ వారం థియేటర్లలోకి 9 సినిమాలు - బాక్సాఫీస్ వద్ద ఆ ఒక్క రోజు జాతరే జాతర
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
Maruti Suzuki Victoris సీఎన్‌జీ హైబ్రిడ్ రూ.2 లక్షల డిస్కౌంట్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
పక్షులు V ఆకారంలో ఎందుకు ఎగురుతాయి? సైన్స్ + ప్రకృతి రహస్యం!
Jabardasth Faima: పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
పెళ్ళి తర్వాత ఫస్ట్ స్కిట్... ఇంద్రజ పరువు తీసిన ఫైమా - టీఆర్పీ స్టంట్ కాదుగా!?
Jyothika Munirathnam: 'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
'గుండెనిండా గుడిగంటలు' రోహిణి... బ్యూటిఫుల్ బోల్డ్ పిక్స్ షేర్ చేసింది
ACB Raids: పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
పెద్దపల్లిలో అడ్డంగా దొరికిన మున్సిపల్ ఏఈ.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ బుక్కయ్యాడు
Embed widget