Watch: బాలీవుడ్ పాటకి 63 ఏళ్ల బామ్మ డ్యాన్స్... నెట్టింట్లో వీడియో వైరల్
63 ఏళ్ల వయస్సులో ఈ బామ్మ ఎంత హుషారుగా డ్యాన్స్ వేస్తుందో చూడండి. ఈ బామ్మ నెట్టింట్లో చాలా మందికి పరిచయం ఉన్నామే. ఆవిడే రవి బాలా శర్మ.
63 ఏళ్ల వయస్సు వారు సాధారణంగా ఏం చేస్తుంటారు? చక్కగా తమ మనమళ్లు, మనరాళ్లతో ఆడుకుంటూ... సమయం కుదిరితే దేవుడి పుస్తకాలు చదువుతూ టైం పాస్ చేస్తుంటారు. కానీ, 63 ఏళ్ల వయస్సులో ఈ బామ్మ ఎంత హుషారుగా డ్యాన్స్ వేస్తుందో చూడండి. ఈ బామ్మ నెట్టింట్లో చాలా మందికి పరిచయం ఉన్నామే. ఆవిడే రవి బాలా శర్మ. వారం రోజుల క్రితం ఈ బామ్మ డ్యాన్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
టైగర్ ష్రాఫ్, అనన్య పాండే నటించిన హిందీ సినిమా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ - 2లోని ‘ద జవానీ’ పాటకు ఈ బామ్మ డ్యాన్స్ వేసింది. సినిమాలో ఈ పాటను విశాల్, శేఖర్ కంపోజ్ చేశారు. ఈ బామ్మ డ్యాన్స్ చూస్తే మీరు ఫిదా అవ్వాల్సిందే. నవ్వుతూ, మ్యూజిక్‌కి తగ్గట్లు ఆమె డ్యాన్స్ చేసింది. సెప్టెంబరు 19న పోస్టు చేసిన ఈ వీడియోని ఇప్పటి వరకు 64వేలకి పైగా వ్యూస్ ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బామ్మ డ్యాన్స్ పై ఓ లుక్కేయండి.
View this post on Instagram
వందలాది మంది కామెంట్లతో బామ్మపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వయస్సులో కూడా ఎంతో యాక్టివ్‌గా, యూత్‌కి పోటీగా డ్యాన్స్ చేస్తున్నావ్ అంటూ కితాబిచ్చారు. సో స్వీట్, సూపర్బ్, ఆంటీకి హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెట్టారు.
Also Read: ఒకే కాండానికి 839 టమాటాలు... గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ఇప్పుడే కాదు గతంలోనూ ఈ బామ్మ చేసిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. పలు సందర్భాల్లో ఆమె డ్యాన్స్ చేసి ఆ వీడియోలను నెటిజన్లతో పంచుకుంది. అలాగే ఫన్నీ వీడియోలు కూడా చేసింది. తన మనమళ్లు, మనమరాళ్లతో కూడా ఆమె ఫన్నీ, డ్యాన్స్ వీడియోలు చేసి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంది.
Also Read: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు