Viral Video: ఈ వీడియో చూసి కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు-తండ్రి కూతుళ్ల ప్రేమకు నెటిజన్లు ఫిదా
Viral Video: ముంబయిలోని లోకల్ ట్రైన్‌లో తండ్రి, కూతుళ్ల మధ్య జరిగిన చిన్న సంఘటన అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.
Viral Video:
నాన్నా..నువ్వు కూడా కొెంచెం తిను..
కొన్ని వీడియోలు మనల్ని చాన్నాళ్ల పాటు వెంటాడతాయి. మన లైఫ్‌లో జరిగిన సంఘటనలన్ని, మన జ్ఞాపకాల్ని గుర్తు చేస్తాయి. కన్నీళ్లు పెట్టిస్తాయి. అవి చూసినంత సేపు గుండె బరువెక్కుతుంది. ఇలాంటి వీడియోలకు నెట్‌లో కొదవే లేదు. సోషల్ మీడియా వచ్చాక, ప్రతి చిన్న మొమెంట్‌ను క్యాప్చర్ చేయటం అలవాటైపోయింది. అప్పటి నుంచి ఈ తరహా ఎమోషనల్ వీడియోలు ఎక్కువ మందికి చేరువవుతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది. ముంబయి లోకల్ ట్రైన్‌లో కనిపించిన ఓ దృశ్యం అందరినీ ఎమోషనల్ చేస్తోంది. నిత్యం వేలాది మందిని తమ గమ్యస్థానాలకు చేర్చే ముంబయి లోకల్ ట్రైన్‌లో ఓ తండ్రి కూతురు మధ్య జరిగిన ఓ చిన్న సంఘటనను డిజిటల్ క్రియేటర్ సాక్షి మెహ్రోత్రా వీడియో తీశారు. అదే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఆమె ఈ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఓ వ్యక్తి ట్రైన్ డోర్ దగ్గర కూర్చుని ఉండగా, ఆయన కూతురు పండ్ల ముక్కలు తింటూ పక్కనే నిలుచుంది. మధ్యలో ఉన్నట్టుండి ఓ పీస్ తీసి నాన్నకు అందించింది. "నువ్వే తినేయమ్మా" అని ఆ తండ్రి అన్నా, ఆ చిన్నారి ఊరుకోలేదు. తానే స్వయంగా ఆ ముక్కను తండ్రికి తినిపించింది. వెంటనే కూతుర్ని దగ్గరకు తీసుకుని తల నిమిరాడా వ్యక్తి. "ఇలాంటివి చూసేందుకైనా జీవించాలని అనిపిస్తుంది" అని వీడియోకి క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశారు సాక్షి మెహ్రెత్రా. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అవుతోంది. 3 లక్షల మంది లైక్ చేయగా వేలాది మంది కామెంట్ చేస్తున్నారు. "అన్‌కండీషనల్ లవ్" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, తండ్రి కూతుళ్ల నిజమైమ ప్రేమ ఇది అని మరో వ్యక్తి కామెంట్ చేసాడు
View this post on Instagram