News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viral Video: ఆడి చాయ్ వాలా అదిరిపోయే స్టోరీ - లగ్జరీ కారునే టీకొట్టుగా మార్చేసిన యువకుడు!

Viral Video: టీ, చాయ్, మసాలా చాయ్, లెమన్ చాయ్, పుదీనా చాయ్.. ఇలా చాలా పేర్లే చెబుతుంటారు. అలాగే వాటిని అమ్మేవాళ్లకు కూడా అలాంటి పేర్లే ఉంటాయి. తాజాగా ఓ ఆడి చాయ్ వాలా తెగ వైరల్ అయిపోయాడు.

FOLLOW US: 
Share:

Viral Video: ఉన్నత చదువులు చదివి ఆ చదువులతో సంబంధం లేని వృత్తిలో స్థిరపడటం కొత్తమే కాదు. చాలా మంది చదివిన చదువులతో సంబంధం లేని దారిలో వెళ్లి విజయతీరాలకు చేరుతుంటారు. ఇక్కడ చదువు జ్ఞానాన్ని ఇస్తే, తమ ఆశలు, కోరికలకు తగ్గట్టుగా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి తమ వృత్తుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. అలా ఉన్నత చదువులు పూర్తి చేసిన వారు, పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నతోద్యోగాలు చేసిన వారు వాటిని వదిలేసి చాయ్ సెంటర్లు, పానీ పూరీ బండ్లు ఏర్పాటు చేయడం వాటిని అద్భుతంగా నడిపించి వార్తల్లో నిలవడం చాలా సార్లు చూసే ఉంటాం. అలాంటిదే ఈ వార్త కూడా. ఓ వ్యక్తి ఉన్నత చదువులు చదివాడు. ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగాడు. లగ్జరీకి పేరొందిన ఆడీ కార్లలో తిరుగుతుంటాడు. కానీ ఇప్పుడు అదే లగ్జరీ కారును టీ కొట్టుగా మార్చేశాడు. అంత లగ్జరీ కారును అతడు టీ కొట్టుగా మార్చి వ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. 

అసలు ఈ వీడియోలో ఏముందంటే..?

ముంబయికు చెందిన మన్ను శర్మ తన ఆడి కారు (Audi Car)ను టీకొట్టుగా మార్చేశాడు. లక్షలు విలువ చేసే ఆ కారు బ్యాక్ సైడ్ లోని టీ చేసేందుకు కావాల్సిన సామగ్రిని పెట్టుకొని మరీ పలు ప్రాంతాల్లో తిరుగుతాడు. తనకు నచ్చిన చోట, జనాలు కనిపించిన చోట కారును ఆపుతూ.. సామాన్లు బయటకు తీసి టీ తయారు చేస్తాడు. అనంతరం తన వద్దకు వచ్చే వారికి టీ విక్రయిస్తుంటాడు. అయితే తెల్లటి ఆడి కార్ లో స్టాల్ యజమాని మన్ను శర్మను మనం వీడియోలో చూడొచ్చు. "ఆన్ డ్రైవ్ టీ" అనే పేరుతో ముంబయిలోని లోఖండ్ వాలాలో టీ అమ్ముతుంటాడు. ఇతని కంపెనీ ట్యాగ్‌లైన్ "థింక్ లగ్జరీ, డ్రింక్ లగ్జరీ". ఈయన వద్ద టీ తాగేందుకు చాలా మందే ఆసక్తి కనబరుస్తున్నారు. కారులో కూర్చొని కూడా ఆయన చేసిన టీని తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆ టీకి 100 రూపాయల వరకూ చెల్లించాల్సి ఉంటుంది. 

ఆడి చాయ్ వాలాపై వెల్లువెత్తుతున్న కామెంట్లు

అయితే సోషల్ మీడియాలో ఇందుకు సంబందించిన వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున దీనిపై స్పందిస్తున్నారు. తమ మనసులోని భావాలను కామెంట్లు రూపంలో వైల్లడిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా కామెంట్ చేస్తున్నారు. కారు కొనడం వల్ల టీ అమ్ముతున్నాడా, టీ అమ్మేందుకు కారు కొన్నాడా అంటూ ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. పని చేయడానికి నామూషీ అక్కర్లేదు.. నీకు నచ్చిన పని చేస్తున్నందుకు చాలా సంతోషం అంటూ మరో నెటిజన్ చెప్పుకొచ్చాడు. ఏ వ్యాపారమూ చిన్న వ్యాపారం కాదు, శ్రమను గౌరవించండి అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ఇప్పటి వరకూ ఈ వీడియోనూ 88 వేల వ్యూస్ రాగా.. 8.6 వేల లైకులు వచ్చాయి.

Published at : 31 May 2023 04:54 PM (IST) Tags: Viral Video Watch Video Mumbai Man Chai From Audi Car Audi Chai

ఇవి కూడా చూడండి

Viral Video: ట్రెడ్‌మిల్‌ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో

Viral Video: ట్రెడ్‌మిల్‌ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో

Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు

Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు

Spanish Man Arrest: లైవ్‌లో రిపోర్టర్‌కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Spanish Man Arrest: లైవ్‌లో రిపోర్టర్‌కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు

Flight: విమానం బాత్రూములో ఓ జంట పాడుపని, సిబ్బంది డోర్ ఓపెన్ చేయగానే ప్రయాణికుల అరుపులు

Viral Video: ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండెలు ధడేల్, రోడ్లపై పారిన 2 మిలియన్ లీటర్ల వైన్

Viral Video: ఈ వీడియో చూస్తే మందుబాబుల గుండెలు ధడేల్, రోడ్లపై పారిన 2 మిలియన్ లీటర్ల వైన్

టాప్ స్టోరీస్

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman - 800 Pre Release : ముత్తయ్య కోసం ముంబైలో సచిన్ - ఇప్పుడు హైదరాబాద్‌లో వీవీఎస్ లక్ష్మణ్