Viral Video: కట్నం, బంగారు గొలుసు కావాలట- 'అదే గొలుసుతో ఉరేసి చంపేయాలి'
కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని ఓ వరుడు మొండికేశాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నానని అడిగిన కట్నం ఇవ్వాల్సిందేనని వరుడు డిమాండ్ చేస్తోన్న వీడియో వైరల్ అయింది.
![Viral Video: కట్నం, బంగారు గొలుసు కావాలట- 'అదే గొలుసుతో ఉరేసి చంపేయాలి' Viral Video Bihar groom demands immediate dowry in viral video, netizens call him 'shameless' - WATCH Viral Video: కట్నం, బంగారు గొలుసు కావాలట- 'అదే గొలుసుతో ఉరేసి చంపేయాలి'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/09/95739fe8afa6584d5822bfda5db9909f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరకట్నం.. మన దేశ పెళ్లి వ్యవస్థలో ఎన్నో దశాబ్దాలుగా పాతుకుపోయిన ఓ వ్యాధి. అయితే తర్వాత వరకట్నం ఇచ్చినా, తీసుకున్నా నేరమే అంటూ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. అయితే ఇప్పటికీ మన దేశంలో కట్నం లేనిదే చాలా వరకు పెళ్లిళ్లు అవడం లేదు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచే పెళ్లి కోసం తల్లిదండ్రులు దిగులు పడే దుస్థితిలో దేశం ఉంది. అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పెళ్లి కొడుకు సిగ్గులేకుండా నాకు కట్నం కావాలని లేకపోతే పెళ్లి చేసుకోనని చెబుతున్నాడు.
ఏం జరిగింది?
दहेज
— हम लोग We The People (@humlogindia) March 6, 2022
इस कालू के कान के नीचे 10 तमाचा मारो pic.twitter.com/DPF2fm02Xl
బిహార్‌వ చప్పల్‌పుర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఓ పెళ్లి ఆగిపోయింది. తనకు ఇస్తానన్న కట్నం వెంటనే ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని పెళ్లి కొడుకు మొండికేశాడు.
తనకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని కనుక అడిగినవన్నీ ఇవ్వాల్సిందేనని పెళ్లి కొడుకు డిమాండ్ చేశాడు. కట్నం అడుగుతున్నందుకు సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తే.. అందరూ తీసుకుంటారని, కానీ ఎవరూ దొరక్కుండా జాగ్రత్తపడతారని నీతులు చెప్పుకొచ్చాడు.
నెటిజన్ల కామెంట్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కట్నం అడిగిన వరుడ్ని తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. "వరుడు అడిగిన అదే బంగారు గొలుసుతో పీక నొక్కి చంపేయాలని" ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోకు ట్విట్టర్‌లో 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.
Also Read: Viral news: ఇలా జుట్టు పెరగడం కూడా ఓ జబ్బే, ఇన్‌స్టాలో వైరలవుతున్న పిల్లాడు
Also Read: Goa Polls 2022: గోవాలో కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు, విజయంపై బీజేపీ ధీమా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)