Viral news: ఇలా జుట్టు పెరగడం కూడా ఓ జబ్బే, ఇన్‌స్టాలో వైరలవుతున్న పిల్లాడు
ఏ విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే పాకేస్తోంది. ఇప్పుడు ఈ బాబు గురించి కూడా అలాగే జరిగింది.
పద్నాలుగు నెలల పిల్లాడు... పాలుగారే బుగ్గలు, ముద్దులొలికే రూపం, కానీ జుట్టే ఏదో తేడా. చూడగానే ఎవరికైనా అనిపిస్తుంది ‘వీడి జుట్టేంటి ఇలా ఉంది?’అని. అదే ఇప్పుడు ఆ పిల్లాడిని సోషల్ స్టార్‌ని చేసింది. ఆ పిల్లాడు లాక్లాన్ శాంపిల్స్. జార్జియాకు చెందిన లాక్లాన్‌కు ‘uncombable hair syndrome’అనే రుగ్మత ఉంది. అందుకే అతని జుట్టు అలా విచిత్రంగా ఉంటుంది. సాధారణంగా వెంట్రుకలు ఒకదానితో ఒకటి కలిసి, ఒక వైపుగా పెరుగుతాయి. కానీ లాక్లాన్ వెంట్రుకలు మాత్రం వేటికవి పెరుగుతాయి. ఒకదానితో ఒకటి అతుక్కోవడానికి ఇష్టపడవు. అది కూడా నిలువుగా పెరుగుతాయి. మన జుట్టు చిక్కుపడుతుంది కానీ, లాక్లాన్ జుట్టు మాత్రం చిక్కుపడదన్నమాట. ఇన్ స్టాలో ఈ పిల్లాడి ఫోటో పోస్టు చేయగానే వైరల్ గా మారిపోయింది. ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఏదైనా అందరికీ లాక్లాన్ మాత్రం తెగ నచ్చేశాడు. ప్రస్తుతం లాక్లాన్ పేరుతో ఇన్ స్టా ఖాతా తెరిచారు. అతనికి 29 వేల మందికి పైగా ఫాలోవర్లున్నారు. అందరూ అతని జుట్టుకు అభిమానులే
వైద్యులు ఏమంటున్నారు?
అన్ కంబబుల్ హెయిర్ సిండ్రోమ్ కలిగిన వారిలో జుట్టును నున్నగా దువ్వడం కుదరదని చెబుతున్నారు వైద్యులు. ఆ జుట్టు పొడిపొడిగా, చిట్లిన జుట్టులా ఉంటుంది. జుట్టు నిర్మాణంలో ప్రోటీన్లను కోడ్ చేసే జన్యువుల మ్యుటేషన్ వల్ల ఈ సిండ్రోమ్ కలుగుతుందని తెలిపారు. చాలా తక్కువ మందిలో ఇలాంటి వ్యాధి కలుగుతుందని, దీని వల్ల పెద్దగా నష్టం లేదని చెప్పారు. యుక్త వయసు వచ్చేసరికి జుట్టు సాధారణంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
View this post on Instagram
Also read: గుండెపోటును అడ్డుకునే పచ్చి బొప్పాయి, మీ మెనూలో దీన్ని చేర్చుకోండి
Also read: సిగరెట్ మానేయలేకపోతున్నారా? ఇవిగో ఈ చిట్కాలు పాటించి చూడండి