Goa Polls 2022: గోవాలో కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు, విజయంపై బీజేపీ ధీమా
Goa Polls 2022: గోవాలో ఈసారి బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటుచేస్తామని సీఎం ప్రమోద్ సావంత్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చేది తామేనన్నారు.
Goa Polls 2022: ఎన్నికల ఫలితాలు వేలువడే రోజు దగ్గర పడుతున్న క్రమంలో రిసార్ట్ రాజకీయాలకు(Resort Politics) తెరలేచింది. గోవా(Goa)లో కాంగ్రెస్(Congress) తమ అభ్యర్థులను రిసార్ట్ కు తరలించాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ నేత, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Pramod Sawant) మంగళవారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ భయం పడుతూనే ఉంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు పారిపోతారని వారు భయపడుతున్నారన్నారు. అందుకే కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించిందన్నారు. మంగళవారం న్యూ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రమోద్ సావంత్ సమావేశమయ్యారు. మార్చి 10న విడుదలయ్యే ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ సాధిస్తామని సావంత్ ధీమా వ్యక్తం చేశారు. 40 మంది సభ్యుల అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ సాధిస్తామన్నారు.
Exit Polls may show anything; confident that BJP is forming govt in Goa once again with majority: Goa CM Pramod Sawant
— ANI (@ANI) March 8, 2022
"We'll take help,of people who are required,for coalition or to form Govt. We'll bring like-minded parties on board if they want," he says on post-poll alliance pic.twitter.com/IzCGtrWv91
గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: ప్రమోద్ సావంత్
చాలా ఎగ్జిట్ పోల్స్ గోవాలో హంగ్ వస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్(Exit Polls) పై స్పందించిన సావంత్.. "ఎగ్జిట్ పోల్స్ లో ఏదైనా చూపించవచ్చు. గోవాలో బీజేపీ మరోసారి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని విశ్వాసం ఉంది" అని ఆయన అన్నారు. స్వతంత్రులు, ఎమ్జీపీ మద్దతుపై పార్టీ తలుపులు తెరిచే ఉంచిందని సావంత్ చెప్పారు. "తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీకి కొన్ని సంఖ్యలు తక్కువగా ఉంటే, మేము సంకీర్ణ ప్రభుత్వాన్ని(Colliation Govt) ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యక్తుల సహాయం తీసుకుంటాం." అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ చెప్పారు. 2017 గోవా ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు కాంగ్రెస్ రిసార్ట్ రాజకీయాలు ప్రారంభించిందని సమాచారం.
ఎగ్జిట్ పోల్స్(Exit Polls)
గోవా రాజకీయం రంజుంగా ఉంది. తమ తీర్పును ఈవీఎంతో వేసిన ఓటర్ ఎలాంటి తీర్పు ఇచ్చాడో అన్న టెన్షన్ పార్టీలకు వదిలేశాడు. హోరాహోరీ ప్రచారంతో ప్రజల మనసులు గెలుచుకునేందుకు పార్టీలు చేసిన ప్రయత్నం ఏ మేరకు ఫలిచిందన్న విషయంపై తీవ్రమైన చర్చ సాగుతోంది. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అదే సస్పెషన్ష్ పెట్టాయి. గోవాలో ఈ సారి రాజకీయం టగ్ ఆఫ్ వార్ లా కనిపిస్తోంది. ఫిబ్రవరి-14న పోలింగ్ జరిగిన ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపలేదని ఇప్పటికీ తెలుస్తోంది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో ఏబీపీ- సీఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి.
పోలింగ్‌బూత్‌ల నుంచి ఓటర్లు వస్తున్న టైంలో అడిగిన సమాచారాన్న చూస్తే కాంగ్రెస్ 12-16 స్థానాలు గెలుచుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా అదే స్థాయిలో సీట్లు కైవశం చేసుకోవచ్చని అంచనా. బీజేపీ 13 నుంచి 17 స్థానాలు గెలుచుకోవచ్చు. ఆప్ స్థానాలు ఐదు వరకు పెరగవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆప్ ఒకటి నుంచి ఐదు స్థానాల్లో పాగా వేసే ఛాన్స్ ఉంది. మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ ఈసారి మరింత బలపడే ఛాన్స్ ఉన్నట్టు ఆ పార్టీ ఇప్పుడు కీలకం కానున్నట్టు సర్వే చెబుతోంది. ఆ పార్టీ ఐదు నుంచి తొమ్మిది స్థానాలు గెలుచుకోనుందని అంచనా. ఇదే జరిగితే ఈ పార్టీవైపు ప్రధాన పార్టీలు చూస్తాయి. ఇతరలు కూడా ఒకట్రెండు స్థానాల్లో గెలవ వచ్చని సర్వే చెబుతోంది.