Viral News: తల్లులు కాబోతున్న 3 తరాల మహిళలు! తల్లి, అమ్మమ్మ, అత్త, కోడళ్లకు ఒకేసారి గర్భం
Viral News: మూడు తరాల మహిళలు ఒకేసారి గర్భంతో ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో గ్రాఫర్ ఆలోచనకు ఇప్పుడు అందరి నుండి ప్రశంసలు లభిస్తున్నాయి.
Viral News: ఇప్పుడు సందర్భం ఏదైనా, కార్యక్రమం ఏదైనా దానిని ఫోటోల రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి చిన్న క్షణాన్ని ఫోటోలో బంధించడానికి వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. జీవితంలోని ప్రత్యేక క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలని, వాటితో జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలన్నదే ప్రతి ఒక్కరీ తాపత్రయం. అయితే ఏదైనా శుభాకార్యం, ఎక్కడికైనా వెళ్లినప్పుడు వందలకొద్దీ ఫోటోలు దిగుతాం కానీ చాలా మంది వాటిని కనీసం చూడను కూడా చూడరు. ఎప్పుడో ఒకప్పుడు గుర్తొచ్చినప్పుడు మాత్రమే అలా ఓ లుక్ పడేస్తుంటారు. అది వేరే సంగతి కానీ.. ఫోటో షూట్లు మాత్రం ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిపోయాయి.
View this post on Instagram
పుట్టినరోజు, పెళ్లి వేడుక, ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్, బిడ్డ పుడితే, బారసాల చేస్తే, మెటర్నిటీ ఫోటో షూట్లు, బిడ్డను ప్రతి వారం, ప్రతి నెల ఫోటోలు తీయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఫోటో షూట్ల జాబితా తెగదు. ఇలా ప్రతి చిన్న సందర్భాన్ని ఫోటోలలో బంధించాలని అనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మెటర్నిటీ ఫోటో షూట్లు కూడా మొదలయ్యాయి. నెలనెలా పెరుగుతున్న గర్భాన్ని ఆ క్షణాలను ఆస్వాదిస్తూ ఫోటో షూట్లు, బేబీ బంప్ తో రకరకాల భంగిమల్లో ఫోజులు సోషల్ మీడియాలో చాలా మంది చూస్తూనే ఉంటున్నాం.
ఈ ఫోటో షూట్లు చేస్తున్నప్పుడు కొందరు వారి క్రియేటివిటీని కూడా చూపిస్తున్నారు. క్రేజీ క్రేజీ ఆలోచనలతో ఫోటోలు తీస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటే అవి క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అలాంటి ఒక ఫోటో షూట్ ఇప్పుడు ఎక్కడ చూసినా అదే కనిపిస్తోంది. అంతగా ఆ ఫోటోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
View this post on Instagram
ఒక ఫోటో అందులో ఒక మహిళ గర్భం ధరించి తన బేబీ బంప్ తో ఫోటోలకు ఫోజులిస్తుంది. పక్కనే తల్లి, అత్త, అమ్మమ్మలు కూడా ఉంటారు. అయితే వారు కూడా తమ బేబీ బంప్స్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది. తల్లి, అమ్మమ్మ, అత్త, కోడలు అంతా ఒకేసారి ప్రెగ్నెంట్స్ గా కనిపించడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు తరాల మహిళలు ఒకేసారి గర్భం ధరించడం ఏంటంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదేలా సాధ్యమంటూ కొంత మంది ప్రశ్నిస్తుంటే.. వావ్ అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోల వెనక అదిరిపోయే ఆలోచన ఉంది. అయితే ఇందులో నిజానిజాలు ఏంటంటే.. ఆ మహిళ మాత్రమే గర్భవతి.. మిగతా వాళ్లంతా కేవలం ఫోటోల కోసమే అలా ఫోజులిచ్చారు. వారు గర్భం ధరించలేదు. పొట్టలో దిండు పెట్టుకుని బేబీ బంప్స్ గా ఫోజులిచ్చారు.
జిబిన్ అనే వ్యక్తి వృత్తిపరంగా ఫోటోగ్రాఫర్. అతని భార్య చింజు ఈమధ్యే గర్భం ధరించింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ ఇంట్లోని వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫోటోగ్రాఫర్ అయిన జిబిన్ తన భార్య బేబీ బంప్ ఫోటోలు తీయాలని నిర్ణయించుకున్నాడు. కొత్తగా ట్రై చేయాలని భావించిన జిబిన్ కు ఈ అద్భుతమైన ఆలోచన వచ్చింది. చింజు ఫోటోల కోసం మీరూ ఫోజులు ఇవ్వాలని తల్లికి, అత్తకు, కోడలికి చెప్పాడు జిబిన్ ఆలోచనకు వారు కూడా సరే అన్నారు. అలా ఈ అద్భుతమైన ఫోటో ఆవిష్కృతమైంది.