Viral News : భర్తల వేధింపులతో విసిగిపోయి పెళ్లి చేసుకున్న మహిళలు
Trending News : మందుకు బానిసైన భర్తలతో విసుగు చెందిన వారి భార్యలు ఒకరినొకరు వివాహం చేసుకున్నారు. వారి భర్తలు పెట్టే చిత్రహింసలు భరించలేక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

Trending News : వింత, వైరల్ వార్తలు ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచే వస్తాయేమో. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఓ వార్త కూడా అక్కడ్నుంచే వచ్చింది మరి. తమ భర్తల ప్రవర్తనతో విసిగిపోయిన భార్యలు వివాహం చేసుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో పరిచయం అయిన వీరిద్దరూ కాశీలో వివాహం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ కి చెందిన ఇద్దరు మహిళలు తమ కుటుంబం నుంచి దూరంగా వెళ్లి ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. జనవరి 23న సాయంత్రం దియోరియాలోని శివాలయంలో కవిత, గుంజ అలియాస్ బబ్లూ అనే మహిళలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మద్యానికి బానిసైన వారి భర్తలు పెట్టే చిత్రహింసలతో విసిగి వేసారిపోయిన ఆ మహిళలు తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. కాలక్రమేణా స్నేహితులుగా మారి తమ భర్తలు పెడుతున్న బాధలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. తామిద్దరూ గృహ హింసకు గురయ్యామని, ఇద్దరి బాధా ఒక్కటే అని భావించారు. అలా వారు రోజూ సోషల్ మీడియా ద్వారా అత్యంత సన్నిహితులై ఒకరు లేకుండా మరొకరు ఉండలేమనే స్థితికి వచ్చారు. దీంతో ఇక పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
View this post on Instagram
అనుకున్నట్టుగానే కవిచ, గుంజలు గురువారం సాయంత్రం దేవరియాలోని ఛోటీ కాశీ అనే శివాలయంలో వివాహం చేసుకున్నారు. ఇక్కడ గుంజ వరుడి పాత్ర పోషించి, కవిత నుదిట తిలకం దిద్దింది. ఆ తర్వాత ఇద్దరూ ఏడడుగులు నడిచి, జీవితాంతం ఒకరికొకరు అండగా ఉంటామని ప్రమాణం చేశారు. ఈ విషయంపై స్పందించిన గుంజ.. భర్తల మద్యపానం అలవాటు, దుష్ప్రవర్తనతో ఇద్దరం హింసకు గురయ్యామని, ప్రేమ, శాంతితో కూడిన జీవితాన్ని గడపడానికి పెళ్లి చేసుకున్నామని చెప్పింది. గోరఖ్పుర్లో ఇంటిని అద్దెకు తీసుకుని జంటగా జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ఇకపోతే ఆ మహిళలు పూల దండలు, సిందూరం తెచ్చి ఆలయంలో పూజలు చేసి వెళ్లిపోయారని ఆలయ పుజారి శంకర్ పాండే తెలిపారు.
స్వలింగ సంపర్క వివాహాలపై సుప్రీం ఏం చెప్పిందంటే..
స్వలింగ సంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు 2023లోనే స్పందించింది. ప్రత్యేక వివాహాల చట్టం కింద చట్టబద్ధత కల్పించేందుకు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని, కోర్టులు చట్టాలను రూపొందించవని చెప్పింది. దీనిపై చట్టబద్దత లేకపోయినప్పటికీ పలు ప్రాంతాల్లో ఇప్పటికీ ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరి 10న బీహార్లోని బెగుసరాయ్కు చెందిన ఒక లెస్బియన్ జంట కూడా ఢిల్లీకి పారిపోయి ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు.
Also Read : Viral Video: చూస్కోవాలి కదండీ - ఫోన్లో మాట్లాడుకుంటూ పసికందుతో పాటు మ్యాన్‌హోల్‌లో పడ్డ మహిళ - షాకింగ్ వీడియో
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

