News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

వీడియో: రైల్వే ట్రాక్‌పై యువకుడు, దూసుకొచ్చిన రైలు - రెప్పపాటులో దేవుడిలా వచ్చిన పోలీస్!

ఓ యువకుడు ఒక్కసారే ప్లాట్‌ఫారమ్ మీద నుంచి పట్టాల పైకి దూకాడు. వేగంగా దూసుకొస్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు. కానీ, అప్పుడే ఓ కానిస్టేబుల్ దేవుడిలా వచ్చి అతడిని రక్షించాడు.

FOLLOW US: 
Share:

Viral video | యువకుడు ప్లాట్‌ఫాం మీద నిలుచుని ఉన్నాడు. కాసేపు అటూ ఇటూ చూశాడు. రైలు ప్లాట్‌ఫారమ్‌ మీదకు వస్తుందని తెలియగానే.. పట్టాల మీదకు దూకేశాడు. అప్పుడే.. దైవం పంపిన దూతలా ఓ పోలీస్ ఎంట్రీ ఇచ్చాడు. వేగంగా దూసుకొస్తున్న రైలును సైతం లెక్క చేయకుండా ఆ యువకుడి మీదకు దూకి ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన బుధవారం మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

థానే జిల్లాలోని విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్‌ మీదకు వస్తున్న రైలు ముందుకు దూకి ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న ప్రభుత్వ రైల్వే పోలీసు (GRP) కానిస్టేబుల్ అధికారి హృషికేష్ మానే(35) ట్రాక్‌పైకి దూకి అతడి ప్రాణాలు రక్షించాడు. ఆ సమయానికి అతడు ఏదో పని మీద అక్కడికి వచ్చాడు. యువకుడు ట్రాక్ మీదకు దూకగానే.. అక్కడే ఉన్న ప్రయాణికుల అరుపులు విని.. వెనక్కి తిరిగి చూశాడు. క్షణం ఆలస్యం చేయకుండా తాను కూడా పట్టాల మీదకు దూకి.. యువకుడి అవతలి వైపుకు తోశాడు. అలా వారు ట్రాక్ మీద నుంచి పక్కకు వెళ్లిన మూడు సెకన్లలోనే రైలు వేగంగా దూసుకొచ్చింది. లక్కీగా ఇద్దరికీ ఏమీ కాలేదు. 

Also read: చర్మక్యాన్సర్ వచ్చిన విషయాన్ని కళ్లు చెబుతాయా? లక్షణాలెలా ఉంటాయి?

ఆ తర్వాత హృషికేష్ బాలుడిని ఫ్లాట్‌ఫారమ్ మీదకు తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ యువకుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి అతడి సమస్యను తెలుసుకొనే ప్రయత్నం చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్(GRP), విజయ్ దారేకర్ తెలిపారు. అతనికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చామన్నారు. ఇదంతా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఆ కానిస్టేబుల్ సహసాన్ని చూసి.. అంతా అతడిని ‘సూపర్ కాప్’ అని పొగుడుతున్నారు. ఈ వీడియోను చూస్తే మీరు కూడా హృషికేష్‌ను ప్రశంసలతో ముంచెత్తుతారు. 

Also read: త్వరలో మగవారికీ గర్భనిరోధక మాత్రలు, అవి వస్తే ఆడవారి కష్టాలు తీరినట్టే

జీఆర్పీ కానిస్టేబుల్ ఆ యువకుడిని ఏ విధంగా రక్షించాడో ఈ వీడియోలో చూడండి: 

Published at : 24 Mar 2022 07:51 PM (IST) Tags: maharashtra Viral video Thane Train accident Police rescue Man jumped in front of train Railway police rescue

ఇవి కూడా చూడండి

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Viral Video: కార్‌పై క్రాకర్స్‌ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్​ కావాలా? ఇండియన్స్​కి క్రేజీ ఆఫర్​ ఇచ్చిన థాయ్​లాండ్

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

టాప్ స్టోరీస్

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?

Telanagna Politics: కాంగ్రెస్‌ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?

Pavan Babu Meet : చంద్రబాబుతో పవన్ భేటీ - అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

Pavan Babu Meet :    చంద్రబాబుతో పవన్ భేటీ -  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ!

CM Revanth : మాట నిలబెట్టుకున్న రేవంత్ - దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

CM  Revanth  :  మాట నిలబెట్టుకున్న రేవంత్ -  దివ్యాంగురాలు జ్యోతికి ప్రమాణస్వీకారానికి ఆహ్వానం

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు

AP High Court: ఎస్‌ఐ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్, 'స్టే' ఎత్తివేసిన హైకోర్టు
×