అన్వేషించండి

Viral News: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఆ రోజు, చేదు అనుభవాన్ని వెల్లడించిన ప్యాసింజర్

ఒక వ్య‌క్తి ఢిల్లీ విమానాశ్ర‌యంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను వివ‌రిస్తూ రెడ్ ఇట్‌లో రాసిన పోస్ట్‌పై నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. అత్యంత దుర్దినంగా ఆ రోజును పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 

Horrible day in Delhi Airport | ఒక వ్య‌క్తి ప్ర‌యాణం నిమిత్తం ఢిల్లీ విమానాశ్ర‌యం చేరుకున్నాడు. 10.30 గంట‌ల‌కు విమానం ఎక్కాల్సి ఉండగా లేట్ అవడంతో త‌నకు తిప్ప‌లు పడ్డానని చెప్పాడు.ఫ్లైట్ అందుకునేందుకు అనుకున్న స‌మయం క‌న్నా ముందుగానే విమానాశ్ర‌యం చేరుకున్నాడు. అవ‌స‌ర‌మైతే లాంజ్‌లో వెయిట్ చేయాలే కానీ, ఫ్లైట్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మిస్ చేసుకోకూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌టు చెప్పాడు. ఆ మేర‌కు విమానం ఎక్కేందుకు ఢిల్లీ విమానాశ్ర‌యం T3 టెర్మిన‌ల్ చేరుకున్నాన‌ని అన్నాడు. అక్క‌డ నిర్మాణ ప‌నులు జ‌రుగుతుండ‌టం త‌న‌కి మ‌రింత ప‌రీక్ష పెట్టింద‌ని చెప్పాడు. ఇంత‌లో తాను ఎక్కాల్సిన విమానం గంట లేట్ అని అనౌన్స్‌మెంట్ రావ‌డంతో ఏమైనా తిన‌డానికి ఫుడ్ స్టాల్స్ వ‌ద్ద‌కు చేరుకున్నాన‌ని, కానీ ధ‌ర‌లు చూసి త‌ల తిరిగిపోయింద‌ని చెప్పాడు.

కేవలం మూడే ఫుడ్ స్టోర్లు ఉండ‌గా ఒక‌దానికి వెళ్లాన‌ని చెప్పాడు. అక్క‌డ టీ, రూ. 200, కాఫీ రూ. 300, ఒక చిన్న గిన్నెలో రాజ్‌మా రైస్ రూ. 400, మెద్దు వ‌డ (3) రూ. 300, బ‌ర్గ‌ర్ రూ. 300 అని రాసి ఉన్న ధ‌ర‌ల‌తో స‌గం ఆక‌లి చ‌చ్చిపోయింద‌ని చెప్పాడు. కనీసం తిన‌డానికి ప్లేస్ కూడా లేద‌ని వాపోయాడు. ఫ్లైట్ మిస్ కాకుండా ఉండేందుక‌ని తిన‌కుండానే ముందే చేరుకుంటే త‌న‌కు దెబ్బ‌మీద దెబ్బ‌లు త‌గిలాయ‌ని త‌న దుర‌దృష్టానికి చేసేదేం లేక న‌వ్వుకున్నాన‌ని చెప్పాడు. 

10.30కి ఎక్కాల్సిన ఫ్లైట్ 2.30కి స్టార్ట్

10.30 గంట‌ల‌కు వెళ్లాల్సిన విమానం గంట లేటు, మ‌రో అర గంట టేకాఫ్‌, ప్ర‌యాణికులు కూర్చోవ‌డానికి టైం తీసుకున్నా త్వ‌ర‌గానే బ‌య‌ల్దేరిపోవ‌చ్చ‌ని సంబ‌ర‌ప‌డేలోపు మ‌రో పిడుగులాంటి వార్త చెవినప‌డింద‌ని వాపోయాడు. విమానాన్ని మ‌ధ్యాహ్నం 2.45 గంట‌ల‌కు రీ షెడ్యూల్ చేసిన‌ట్టు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పడంతో త‌న బాధ వ‌ర్ణణాతీతంగా ఉంద‌న్నాడు. విమానంలో 12 గంట‌ల‌కు ఎక్కి కూర్చుని 2.45 వ‌ర‌కు నిరీక్షించామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అందునా ప్లైట్ టెర్మిన‌ల్ 1 నుంచి ఫ్లై అవుతుంద‌ని చెప్పాడు. ఆ స‌మ‌యంలో తాము టెర్మిన‌ల్ 3 వ‌ద్ద ఉన్నామ‌ని చెప్పాడు. ఈ విధంగా త‌న ఆవేద‌నపై ఓ ప్ర‌యాణికుడు పెట్టిన పోస్టుపై నెటిజన్లు కూడా ఫ‌న్నీగానే స్పందిస్తున్నారు.

బీచ్ కెళ్లి ఇసుక చూసి ఏడ్చిన‌ట్టుంది.. 

విమానాశ్ర‌యంలో ఫుడ్ ధ‌ర‌లు భారీగా ఉంటాయ‌ని తెలిసి కూడా తిన‌కుండా రావ‌డం నువ్వు చేసిన త‌ప్పేన‌ని దానికి నీకు ఇదొక గుణ‌పాఠంగా గుర్తుండిపోతుంద‌ని ఒక నెటిజ‌న్ కామెంట్ చేశాడు. మ‌రో వ్య‌క్తి రాస్తూ విమాన ప్ర‌యానాల్లో ఇలాంటివ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణం, ముందుగానే మ‌నం సిద్ద‌ప‌డి ఉండ‌టం ఉత్త‌మం అని త‌న అనుభ‌వం వ్య‌క్త‌ప‌రిచాడు. మ‌రో వ్య‌క్తి దీని గురించి కామెంట్ చేస్తూ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఎక్కేటప్పుడు ఇలాగే జ‌రుగుతుంటుంద‌ని, ప్ర‌యాణికులు లేక విమానం నిండ‌క‌పోతే ఇలా చేస్తుంటార‌ని చెప్పాడు. అస‌లు స్పైస్ జెట్ బుక్ చేసుకోక‌పోవ‌డ‌మే ఉత్త‌మం అని రాశాడు. మ‌రొక‌రైతే బీచ్ కెళ్లి ఇసుక గురించి బాధ‌ప‌డినంత ఫ‌న్నీగా ఎయిర్‌పోర్టులో ధ‌ర‌ల గురించి మాట్లాడుతున్నావ‌ని కామెంట్ చేశాడు. 
"ఫ్లైట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరిన తర్వాత, మేమంతా ఉదయం 11:30 గంటలకు విమానం ఎక్కడం ప్రారంభించాము మరియు మధ్యాహ్నం 12:00 గంటలకు విజయవంతంగా బోర్డింగ్ ముగించాము. విమానం ఇంకా టేకాఫ్ కానప్పటికీ, హోస్టెస్‌లు చెబుతూనే ఉన్నారు. మేము టేకాఫ్ చేయడానికి ముందు నిర్ధారణ కోసం వేచి ఉన్నాము మరియు తరువాతి 30 నిమిషాలు ఆగాము మరియు చివరకు 12:30pm వద్ద మేము అకస్మాత్తుగా ఇప్పుడు ఫ్లైట్ నుండి బయలుదేరమని అభ్యర్థిస్తున్నాము మరియు ఫ్లైట్ ఆలస్యమైందని మరియు కొత్త టేకాఫ్ సమయం అని అధికారిక నవీకరణ వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నం 2:45," వారు రెడ్డిట్‌లో చెప్పారు.

వినియోగదారు వారి పోస్ట్‌ను సరిదిద్దారు. వారు టెర్మినల్ 1 నుండి వెళ్తున్నట్లు చెప్పారు. తరువాత, ఒక నవీకరణలో, విమానం "కొన్ని భాగాలను కోల్పోయిందని మరియు మరొక విమానం దానిని డెలివరీ చేయవలసి ఉందని విమాన సిబ్బంది తెలియజేసారు. డెలివరీ ఫ్లైట్ ఉండాలి. మధ్యాహ్నం 2:30కి చేరుకుంటారు."

షేర్ చేయబడినప్పటి నుండి, పోస్ట్ సోషల్ మీడియా వినియోగదారుల నుండి అనేక ప్రతిస్పందనలను పొందింది.

ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు, "మీరు మొదటి సారి ప్రయాణిస్తున్నారా? ఇవి విమానాశ్రయాలలో చాలా సాధారణ ధరలు. T3లో అనేక రకాల ఆహార ఎంపికలు ఉన్నాయి, కాబట్టి మీరు తప్పనిసరిగా ఆ విభాగాన్ని దాటవేసి మీ గేటు దగ్గరికి వెళ్లి ఉండాలి."

"మీ ఫ్లైట్ ఆలస్యం కావడానికి కారణం వారు రెండు వేర్వేరు విమానాల నుండి ప్రయాణీకులను కలపడం వల్ల ఒక విమానం పూర్తిగా బుక్ కానప్పుడు ఖర్చులను తగ్గించడం. కాబట్టి, స్పైస్‌జెట్‌తో బుక్ చేసుకోకపోవడమే మంచిది" అని మరొకరు చెప్పారు.


"విమానాశ్రయంలో ఆహార ధరల గురించి ఏడ్చే బదులు ఇంటి నుండి ఆహారం తీసుకురావాలి. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌పోర్ట్ ఫుడ్ ఖరీదైనది. బీచ్‌కి వచ్చి ఇసుక గురించి ఏడుస్తున్నట్లుంది" అని మూడవ వినియోగదారు చెప్పాడు.

"విమానాశ్రయాలలో ఆహారం సరైన ధరతో ఉంటుంది, దుకాణాలు అద్దెకు ఇవ్వబడ్డాయి మరియు దాని అద్దె చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు కొనుగోలు చేసే ఆహారం కూడా ఖరీదైనది, ఇది భారతదేశం వెలుపల ఉన్న అన్ని విమానాశ్రయాలకు వర్తిస్తుంది, విమానాశ్రయంలోని దుకాణాలు స్వచ్ఛంద సంస్థ కోసం నడుపబడవు, అవి లాభాలు సంపాదించాలి మరియు ఉద్యోగులకు జీతం చెల్లించాలి మరియు వారి కుటుంబాలను పోషించాలి, విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ ఖర్చు మొదలైనవి" అని రెడ్డిట్ వినియోగదారు వ్యాఖ్యానించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలులెబనాన్‌లో పేజర్ పేలుళ్ల కలవరం, ఇజ్రాయేల్‌పై ఆరోపణలుభారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Embed widget