Viral Video: వామ్మో కింగ్ కోబ్రా.. తోక పట్టి లాగితే గుండె ఝల్లుమంది!
తోక పట్టుకొని లాగితే ఓ కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ కోపంగా చూస్తోన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఆ వీడియో చూసేయండి.
సాధారణంగా చాలా మంది పాములంటే తెగ భయపడిపోతుంటారు. ఒకవేళ పొరపాటున కంటపడితే వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత అక్కడి, దరిదాపుల్లోకి వెళ్లటానికి కూడా సాహసం చేయరు. అయితే, ఒక్కోసారి పాములు, కొండ చిలువలు ఆహరం కోసం లేదా ఆవాసం కోసం మనిషి ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్న సంఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే, తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఏం జరిగింది?
ఓ నిర్మాణం జరుగుతోన్న స్థలంలోకి ఓ భారీ కింగ్ కోబ్రా వచ్చింది. అయితే ఓ పాములు పట్టే వ్యక్తి చేతిలో స్నేక్ క్యాచర్ స్టిక్ పట్టుకొని వచ్చాడు. గది బయట పాము తోక కనిపించే సరికి దాన్ని లాగాడం ప్రారంభించాడు. ఓ చేతిలో స్టిక్ పట్టుకొని.. మరో చేత్తో కింగ్ కోబ్రా తోక పట్టుకొని లాగాడు. అయితే ఊహించని విధంగా ఆ కింగ్ కోబ్రా పైకి లేచి పడగ విప్పి.. కోపంగా బుసలు కొడుతూ అతని మీదకి వచ్చింది.
Never Judge a snake by it's tail ?@Pendrive_Baba pic.twitter.com/ytet6ps7bg
— Jude David (@judedavid21) September 6, 2021
అది చూసి జడుసుకున్న అతను.. వెంటనే స్టిక్ పక్కకి విసిరి వెనక్కి జరిగాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అనే విషయంపై సమాచారం లేదు. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు.
అందులో కొంతమంది "తోకను చూసి పామును అంచనా వేయొద్దు" అంటూ కామెంట్లు పెట్టారు. మరి కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
WTF 😱😱😱😳😳😳😭😭😭@airplanetalk see this, how can I not get a heart attack 😄😄😄
— yash (@yadsul) September 6, 2021
Oh my GOD 🤯😱😰😨 gunde aginantha panaindhi wolfuu 🥶vennupusalo vonuku putindhi vadiki yela anipinchindo emo 🙏🏽😵💫
— ⚡hiva ⚡harma (@__InfiniteLove) September 7, 2021