Chupacabra In Texas Zoo: ఈ వింత జీవి ఏంటో తెలుసా? రాత్రి దర్శనం, పగలు మాయం!
Chupacabra In Texas Zoo: ఓ వింత జీవి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ జంతువు ఏంటి?
Chupacabra In Texas Zoo: అచ్చం మనిషిలా రెండు కాళ్లతో తిరిగే వింత జీవిని చూశారా? అసలు అలాంటిదేం లేదు అనుకుంటున్నారా? కానీ ఓ వింత జంతువు అర్ధరాత్రి వేళ సంచరిస్తోంది. అచ్చం మనిషిలాగ రెండు కాళ్లతో తిరుగుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ ఫొటో తెగ వైరల్ అవుతోంది.
What is it? Strange image caught on camera at Texas zoo. DETAILS >>> https://t.co/W3Xxgycw5Y pic.twitter.com/o9gGAk61kY
— WFTV Channel 9 (@WFTV) June 9, 2022
జూ లో
టెక్సాస్ అమారి పట్టణంలో ఓ జూ ఉంది. ఆ జూ లో గత నెల 21న అర్ధరాత్రి సుమారు 1.25 గంటలకు మనిషిలా రెండు కాళ్లతో ఓ వింత జంతువు నిలబడి ఉంది. అందుకు సంబంధించిన విజువల్స్ జూ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అయితే అది జూ లోపల ఉందేమోనని అధికారులు చెక్ చేయగా ఆ జంతువు జూ వెలుపల ఉన్నట్లు తెలిసింది. కానీ ఆ జంతువు ఏంటి అనేది వారికి అర్థం కాలేదు.
ఈ విషయం స్థానిక మీడియాకు తెలియడంతో ఈ వార్త కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు కామెంట్లు, షేర్లతో హోరెత్తిస్తున్నారు.
ప్రాంక్ ఆ
It’s a skin walker wouldn’t surprise me
— Amber Termunde (@ATermunde) June 9, 2022
It a sith lord @starwars right?… right…
— B1-Waffledroid (@B1Waffledroid) June 9, 2022
ఇది నిజంగా వింత జీవేనా లేక ఎవరైనా ప్రాంక్ చేశారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కానీ ఈ వింత జీవి ఇప్పటికే చాలా సార్లు కనిపించడంతో అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఆ జీవి ఏంటి అని అధికారులు జుట్టు పీక్కుంటున్నారు. అసలు ఈ జీవి ఏంటో మరి.
Also Read: Bharat Gaurav Train: దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు- ఇందులో వసతులు చాలా స్పెషల్ గురూ!
Also Read: Presidential Election: దీదీకి 'KK' షాక్- రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యత గోవిందా గోవిందా!