అన్వేషించండి

Presidential Election: దీదీకి 'KK' షాక్- రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యత గోవిందా గోవిందా!

Presidential Election: ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల వేళ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ కీలక భేటీకి టీఆర్ఎస్, ఆమ్‌ఆద్మీ, బీజేడీ పార్టీలు గైర్హాజరయ్యాయి. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ భేటీ జరుగుతోంది.

17 పార్టీలు

ఈ సమావేశానికి 17 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (M), సీపీఐఎమ్‌ఎల్, ఆర్‌ఎస్‌పీ, శివసేన, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ, నేషనల్ కాన్ఫెరెన్స్, పీడీపీ, జేడీ(S), డీఎమ్‌కే, ఆర్‌ఎల్‌డీ, ఐయూఎమ్ఎల్, జేఎమ్ఎమ్ పార్టీల నేతలు ఈ సమావేశానికి వచ్చారు.

KK షాక్!

ప్రతిపక్షాల ఐక్యతలో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ భేటీకి హాజరుకాకపోవడం దీదీకి పెద్ద మైనస్ అని విశ్లేషకుల మాట. ఇప్పటికే ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పాల్గొనలేరని శివసేన ప్రకటించింది. మరోవైపు బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఈ భేటీకి డుమ్మా కొట్టారు.

మరోవైపు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ వ్యవహారంపై స్పందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని ఈ భేటీ పిలవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఈ సమావేశానికి గైర్హాజరైంది.

విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించే చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

కాంగ్రెస్ తరఫున

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ భేటీకి ఆహ్వానించినప్పటికీ, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడం సాధ్యంకాదని, ఎందుకంటే, కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు ఉన్నాయని ఖర్గే అన్నారు. 

అభ్యర్థి ఎవరు?

శరద్ పవార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలపాలని మమతా బెనర్జీ గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవార్ ససేమిరా అన్నట్లు సమాచారం. 

Also Read: Congress Protest: 21 గంటలు, 80 ప్రశ్నలు- వరుసగా మూడో రోజూ రాహుల్ గాంధీ విచారణ

Also Read: Viral News: ఇంగ్లీష్‌లో 35 వచ్చాయ్ సర్, మ్యాథ్స్‌లో 36 వచ్చాయండి- కానీ కలెక్టర్ అయ్యారు కదా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Andhra News: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - సంక్రాంతి సెలవులు పొడిగింపు, ఎవరికంటే?
Turmeric Board: రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ - నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, ఫలించిన ఏళ్ల కల
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
జపాన్‌లో భారీ భూకంపం - సునామీ అలర్ట్ జారీ
Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్ - హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు తరలింపు
Sankranti Celebrations: మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
మా గోదారోళ్లంటే మామూలుగా ఉండదు! - కొత్త అల్లుళ్లకు ఆ మాత్రం మర్యాద చెయ్యొద్దా?, అల్లుడు గారూ ఇవి కాస్త తినిపెట్టండి!
MP Brahmin Board : బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
బ్రాహ్మణ జంటలకు బంపరాఫర్ - నలుగురు పిల్లల్ని కంటే రూ.లక్ష, మధ్యప్రదేశ్ బోర్డు సంచలన ప్రకటన
Publicity gold:  కోటి రూపాయల పతంగి అంట  - నమ్మేద్దామా ?
కోటి రూపాయల పతంగి అంట - నమ్మేద్దామా ?
Embed widget